HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Intresting Comments On Police Schools

CM Revanth Reddy: సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. హైదరాబాద్, వ‌రంగ‌ల్‌లో పోలీస్ స్కూల్స్‌..!

50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

  • Author : Gopi Date : 11-09-2024 - 12:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy

CM Revanth Reddy: పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని అన్నారు.

అంతేకాకుండా వ్యసనాలకు బానిసలైన కొంతమంది డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపాలి. మీ అందరిని (ఎస్సై ట్రైనింగ్ అయిన‌పోయిన వారిని ఉద్దేశించి) చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతోందన్నారు. ఇది ఉద్యోగ బాధ్యత కాదు.. ఇది భావోద్వేగం. తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్ తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే అని తెలిపారు.

Also Read: Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?

డ్రగ్స్ , గంజాయిపై ఉక్కు పాదం మోపుతాం. డ్రగ్స్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. తెలంగాణను కాపాడుకునేందుకే ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించండి. 50 ఎకరాల్లో హైదరాబాద్ లో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. 50 ఎకరాల్లో వరంగల్ లో మరో పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ లో పోలీస్ స్కూల్ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ బాధితులకు మాత్రమే నేరస్తులకు కాదు. ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోందని ఈ సంద‌ర్భంగా తెలిపారు. కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం. కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామ‌న్నారు. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామ‌న్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • Police Schools
  • police training
  • Sub Inspectors
  • telangana
  • ts politics

Related News

Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

తెలంగాణలోని ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు పౌరసరఫరాల శాఖ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రక్రియను ఈ నెలాఖరు (జూన్ 30) లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. లేదంటే ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలో కోత విధించనున్నారు. గత ఏడాది కాలంగా ఈ-కేవైసీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది వినియోగదారు

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

  • A techie who gave up the American dream... today, she is a role model for many farmers. So, who is Sanjana Reddy? What is this interesting story?

    Sanjana Reddy Inspiring Journey: అమెరికన్ కలను వదులుకున్న టెక్కీ… నేడు ఆమె ఎందరో రైతులకు ఆదర్శం.. ఇంతకీ సంజన రెడ్డి ఎవరు? ఏంటా ఇంట్రెస్టింగ్ స్టోరీ

  • Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

    Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

Latest News

  • Sleeping Benefits: ఉత్తర దిశ వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదో మీకు తెలుసా?

  • Donald Trump: ఇరాన్ కు ట్రంప్ హెచ్చరిక

  • Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd