Sleep Disorders: యువతకు బిగ్ అలర్ట్.. మీలో కూడా ఈ సమస్య ఉందా?
మీరు ప్రతి ఉదయం అలసటగా అనిపిస్తే లేదా రాత్రి సరిగా నిద్రపోలేకపోతే కొన్ని సులభమైన అలవాట్లను ప్రయత్నించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. మేల్కొనండి. రాత్రిపూట మనస్సును శాంతపరిచే కార్యకలాపాలు చేయండి.
- By Gopichand Published Date - 08:40 PM, Sat - 11 October 25

Sleep Disorders: ప్రస్తుత బిజీ జీవనశైలిలో ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పని, చదువు, సోషల్ మీడియా, ఆటలు, ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతోంది. పరిస్థితి ఏంటంటే.. గంటల తరబడి రీల్స్‌కు బానిస కావడం వల్ల మన నిద్ర నెమ్మదిగా (Sleep Disorders) నిర్లక్ష్యం అవుతోంది. ఇలాంటప్పుడు మనం నిద్రలేచిన తర్వాత అలసటగా అనిపిస్తుంది. రోజంతా బద్ధకంగా ఉంటాం.
ఇటీవల న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీ (Otago University) నిర్వహించిన ఒక పరిశోధనలో నేటి యువత, ముఖ్యంగా టీనేజర్లు నిద్రపోయే ముందు మొబైల్ స్క్రీన్‌పై చురుకుగా ఉండటం వల్ల వారి నిద్ర నాణ్యత దెబ్బతింటోందని తేలింది. ఈ నేపథ్యంలో నిద్రలేమి యువతపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
యువతలో పెరుగుతున్న నిద్ర సమస్యలకు కారణాలు ఏమిటి?
నేటి కాలంలో యువత అనేక కారణాల వల్ల పూర్తి, మంచి నిద్ర పొందలేకపోతున్నారు. స్క్రీన్ టైమింగ్ పెరగడం నిద్ర సమస్యకు అతిపెద్ద కారణం. మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ రోజంతానే కాకుండా నిద్రపోయే ముందు వరకు ఉపయోగించబడుతున్నాయి. దీనితో పాటు శారీరక శ్రమ లేకపోవడం వల్ల కూడా యువత నిద్ర చెడిపోతోంది. రోజంతా కూర్చుని చదువుకోవడం లేదా ఆటలు ఆడటం ఇప్పుడు సాధారణమైపోయింది. ఇక సోషల్ మీడియా ఒత్తిడి, ఎల్లప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండటం, ఏదైనా పోస్ట్ చేయడం లేదా ఇతరుల పోస్ట్‌లు చూడటం మెదడును ప్రశాంతంగా ఉంచకుండా అడ్డుకుంటుంది. దీని కారణంగా పూర్తి, మంచి నిద్ర పొందలేకపోతున్నారు. అంతేకాకుండా అర్థరాత్రి స్నాక్స్ తినడం, భారీ భోజనం చేయడం లేదా కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోవడం నిద్రను పాడు చేయవచ్చు.
Also Read: IT Sector Layoffs: దేశంలో మరో 50 వేల మంది ఉద్యోగాలు ఔట్?!
పరిశోధన ఏం చెబుతోంది?
ఒటాగో యూనివర్సిటీ పరిశోధనలో 100 మందికి పైగా టీనేజర్ల నిద్ర, వారు నిద్రపోయే ముందు అలవాట్లపై పరిశోధన జరిగింది. ఇందుకోసం బాడీ కెమెరా, ఆహారపు డైరీ వంటి సాంకేతికతలను ఉపయోగించారు. పరిశోధనలో 99 శాతం టీనేజర్లు నిద్రపోయే ముందు వరకు స్క్రీన్‌ను ఉపయోగిస్తున్నారని తేలింది. 63 శాతం టీనేజర్లు నిద్రపోయే ముందు ఏదైనా తింటున్నారు. 22 శాతం టీనేజర్లు నిద్రపోయే ముందు వ్యాయామం చేస్తున్నారు. అయితే ఈ అలవాట్లను నివారించడానికి ప్రయత్నించిన వారి నిద్రలో కూడా పెద్దగా తేడా కనిపించలేదు.
ఈ అలవాట్లతో నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది
మీరు ప్రతి ఉదయం అలసటగా అనిపిస్తే లేదా రాత్రి సరిగా నిద్రపోలేకపోతే కొన్ని సులభమైన అలవాట్లను ప్రయత్నించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోండి. మేల్కొనండి. రాత్రిపూట మనస్సును శాంతపరిచే కార్యకలాపాలు చేయండి. ఉదాహరణకు పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా ధ్యానం లాంటివి చేయండి. నిద్రపోయే ముందు ఎక్కువగా తినవద్దు. కానీ ఆకలితో కూడా ఉండవద్దు. సాయంత్రం 5 గంటల తర్వాత కెఫీన్ తీసుకోకండి. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయండి.