IT Sector Layoffs: దేశంలో మరో 50 వేల మంది ఉద్యోగాలు ఔట్?!
ఇటీవల TCS, Accenture వంటి పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా TCS మార్చి 2026 నాటికి తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం (సుమారు 12,000 మంది) మందిని తొలగించాలని యోచిస్తోంది.
- By Gopichand Published Date - 07:28 PM, Sat - 11 October 25

IT Sector Layoffs: దేశంలోని ఐటీ రంగంలో (IT Sector Layoffs) భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు జరగనున్నాయి. అంచనాల ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి 50,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. ఈ సంఖ్య పెరగవచ్చు లేదా తగ్గవచ్చు కూడా. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 2023, 2024 మధ్య దాదాపు 25,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ సంవత్సరం ఆ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి కంపెనీలు రకరకాల వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఉదాహరణకు పనితీరు సరిగా లేదనే సాకుతో ఉద్యోగం నుండి తొలగించడం, ప్రమోషన్లు ఆలస్యం చేయడం లేదా స్వచ్ఛందంగా రాజీనామా చేయమని కోరడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి.
మరింత మందిని తొలగించే అవకాశం
ఇటీవల TCS, Accenture వంటి పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా TCS మార్చి 2026 నాటికి తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం (సుమారు 12,000 మంది) మందిని తొలగించాలని యోచిస్తోంది. అదేవిధంగా Accenture జూన్, ఆగస్టు మధ్య ప్రపంచవ్యాప్తంగా తమ 11,000 మంది ఉద్యోగులను తొలగించింది.
Also Read: Shubman Gill: గిల్ నామ సంవత్సరం.. 7 మ్యాచ్‌లలో 5 శతకాలు!
US ఆధారిత HFS రీసెర్చ్ CEO ఫిల్ ఫర్స్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం చాలా పెద్ద కంపెనీలు రహస్యంగా చాలా మందిని తొలగించాయని తెలిపారు. Teamlease Digital CEO నీతి శర్మ అంచనా ప్రకారం.. ఉద్యోగాలు కోల్పోయే ఐటీ నిపుణుల సంఖ్య సంవత్సరం చివరి నాటికి 55,000-60,000కు పెరగవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యుగంలో కంపెనీలు ఉద్యోగులను తొలగించి, పని కోసం టెక్నాలజీపై ఆధారపడుతున్నాయి.
ఉద్యోగాల కోతకు కారణాలు ఏమిటి?
భారతదేశంలోని కంపెనీలు AI ట్రాన్స్‌ఫర్మేషన్ యుగంలో తమను తాము మలచుకుంటున్నాయి. పని చేసే విధానాలు మారుతున్నాయి. AIని స్వీకరించడం అనేది కేవలం ఖర్చు తగ్గింపు కోసమే కాకుండా, ఒక వ్యూహాత్మక మార్పు కూడా.
దీనితో పాటు ఉద్యోగాల కోతకు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఇమ్మిగ్రేషన్ పాలసీ, H-1B వీసాల పెరుగుతున్న ఖర్చు మొదలైనవి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, AI, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో నైపుణ్యం ఉన్న కంపెనీలు ఈ మార్పును మరింత విజయవంతంగా స్వీకరిస్తున్నాయి.