Green Coffee Benefits: గ్రీన్ టీ మాత్రమే కాదు గ్రీన్ కాఫీ కూడా ఆరోగ్యానికి ప్రయోజనమే
- Author : Gopichand
Date : 23-06-2024 - 6:15 IST
Published By : Hashtagu Telugu Desk
Green Coffee Benefits: టీ తాగిన తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే మీరు గ్రీన్ కాఫీని (Green Coffee Benefits) ట్రై చేయవచ్చు. గ్రీన్ టీ లాగా.. గ్రీన్ కాఫీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైనదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని మీరు డైలీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్లాక్ కాఫీ మాదిరిగానే బీన్స్ నుంచి గ్రీన్ కాఫీని తయారు చేస్తారు. గ్రీన్ కాఫీ సహజ రుచిని కాపాడటానికి పేరు పొందింది. ఆరోగ్యానికి వరం లాంటి గ్రీన్ కాఫీలో పెద్ద మొత్తంలో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ కాఫీ అద్భుతమైన ప్రయోజనాలు
మధుమేహ రోగులకు మేలు చేస్తుంది
రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందనే భయంతో డయాబెటిక్ పేషెంట్లు టీ లేదా కాఫీ తాగడం మానేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో గ్రీన్ కాఫీ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. ఇది చాలా ప్రయోజనకరమైనది. దీనితో షుగర్‌ని సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు. అందువల్ల గ్రీన్ కాఫీ డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం కంటే తక్కువ కాదని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది
గ్రీన్ కాఫీ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రోజూ గ్రీన్ కాఫీ తాగితే ఊబకాయం సులభంగా తగ్గిపోతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గ్రీన్ కాఫీ తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీనివల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది. ఇది కడుపు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read: TTD: శ్రీవారి దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పు లేదు – టీటీడీ
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది
మనం సాధారణ కాఫీ తాగినప్పుడు శరీరంలో కెఫీన్, కొన్ని విషపదార్ధాల పరిమాణం పెరుగుతుంది. గ్రీన్ కాఫీ తాగడం వల్ల శరీరంలోని మురికి, టాక్సిన్స్ తొలగిపోతాయి. గ్రీన్ కాఫీ శరీరాన్ని డిటాక్సిఫై చేయడానికి పనిచేస్తుంది. రిచ్ యాంటీఆక్సిడెంట్లు గ్రీన్ కాఫీలో కనిపిస్తాయి, ఇది చర్మం, జుట్టు, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
We’re now on WhatsApp : Click to Join
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల గ్రీన్ కాఫీ అనేది సైకోమోటర్, కాగ్నిటివ్ పనితీరును మెరుగుపరుస్తుంది. అల్జీమర్స్ వ్యాధిని నివారిస్తుంది. కెఫీన్ సమృద్ధిగా ఉండటం వల్ల మానసిక స్థితి, శ్రద్ధ, చురుకుదనం, మెదడు పనితీరును మెరుగుపరచడానికి డోపమైన్ విడుదలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది రక్తపోటును నియంత్రించడంలో, అథ్లెటిక్ పనితీరు, ఓర్పును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.