HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >If Belly Fat Is Increasing It Means This Hormone Is High

Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-06-2026 - 2:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If belly fat is increasing, it means this hormone is high!
If belly fat is increasing, it means this hormone is high!

అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ (Cortisol) హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. మన శరీరం సక్రమంగా పనిచేయడానికి వివిధ రకాల హార్మోన్లు అవసరం.

హార్మోన్లు కూడా కెమికల్స్‌ లాంటివే; ఇవి మన రక్తప్రవాహం ద్వారా అవయవాలు, చర్మం, కండరాలు మరియు ఇతర కణజాలాలకు సందేశాలను తీసుకెళ్తాయి. ఇవి మన శరీరంలో జరిగే అనేక విధులను సమన్వయం చేస్తాయి. ఈ సంకేతాలు మీ శరీరానికి ఏమి చేయాలో, ఎప్పుడు చేయాలో తెలియజేస్తాయి. ఈ హార్మోన్లలో కార్టిసోల్ కూడా ఒకటి. అడ్డ్రినల్ గ్రంథులు కార్టిసోల్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఉదయం పూట ఎక్కువగా విడుదలవుతుంది. కార్టిసోల్ మన శరీరంలో కొవ్వును, ప్రోటీన్లను, కార్బోహైడ్రేట్స్‌ను నియంత్రిస్తుంది. ఒత్తిడిని నియంత్రిస్తుంది. హైపర్‌టెన్షన్, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మన నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది.

అయినప్పటికీ, ఏదైనా హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే ఆరోగ్యానికి ప్రమాదకరం. మన శరీరంలో కార్టిసోల్ స్థాయిలు పెరిగితే ఏమి జరుగుతుందని పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా వివరించారు. దీర్ఘకాలం పాటు మన శరీరంలో కార్టిసోల్ పెరుగుతూ ఉంటే.. మన ఆరోగ్యానికి మేలు బదులు ఎంతో నష్టం చేస్తుందని లవ్‌నీత్ బాత్రా అన్నారు.

ఈ సమస్యలు వస్తాయి:

బాగా ఒత్తిడికి గురైనా, కోపం వచ్చినా మన శరీరంలో కార్టిసోల్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల మన శరీరం మరింత ఉత్తేజితమై, దాని ప్రభావం కండరాలమీద పడుతుంది. ఫలితంగా..

  1. హైపర్‌టెన్షన్ పెరుగుతుంది.
  2. బెల్లీ ఫ్యాట్, ఫేస్ ఫ్యాట్ పెరుగుతాయి.
  3. కండరాల బలహీనత,
  4. మూడ్ స్వింగ్స్,
  5. ఎముకలు బలహీనపడటం,
  6. జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వస్తాయి.
  7. ఎలా తగ్గించుకోవాలి?
  8. ప్రశాంతంగా నిద్రపోండి
  9. రెగ్యులర్‌గా వ్యాయామం చేయండి
  10. ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోండి
  11. ధ్యానం, ప్రాణాయామం చేయండి

మీకు ఇష్టమైన పనులు చేయండి (మ్యూజిక్ వినడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్ లాంటివి) ఎంత ఉండాలి?

  • ఉదయం 6 నుంచి 8 గంటల వరకు: డెసి లీటర్‌కు 10 నుంచి 20 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.
  • సాయంత్రం 4 గంటల సమయంలో: డెసి లీటర్‌కు 3 నుంచి 10 మైక్రో గ్రాములు (mcg/dL) ఉండాలి.
  • కార్టిసోల్ పెరిగిందని ఎలా తెలుస్తుంది?
  • క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, శరీరంలో కార్టిసోల్ స్థాయిని మూత్రం, కఫం ద్వారా గుర్తించవచ్చు. దీనిని గుర్తించడానికి డాక్టర్లు టెస్టులు చేస్తారు.

ఈ ఆహారం తీసుకోండి:

గుమ్మడి విత్తనాలు, బాదంపప్పు, తాజా ఆకుకూరలు, జీడిపప్పు వంటివాటిలో ఉండే మెగ్నీషియం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీలు, నారింజ, జామ పండ్లు మెదడులోని న్యూరో ట్రాన్స్‌మిటర్లను సమన్వయం చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి. గుడ్లు, చేప, చికెన్, తక్కువ కొవ్వు ఉండే పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చిక్కుడు గింజలు వంటివి మెదడును చురుగ్గా ఉంచుతాయి. ఇవి సెరోటోనిన్ స్థాయిలను పెంచి, ఆందోళనకు కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్‌ను తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • belly fat
  • Belly Fat Reduction
  • belly fat side effects
  • Belly Fat tips
  • Harmon Imbalance
  • health care
  • hormone
  • hormones
  • Imbalance Symptoms

Related News

Do you know the benefits of fish oil?

Fish Oil: ఫిష్ ఆయిల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా…?

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి జుట్టు తెల్లబడుతుంది. అయితే ఈ సమస్యను నివారించేందుకు ఎన్నో సహజమైన మార్గాలు ఉన్నాయి. తెల్లబడిన జుట్టును నల్లగా మార్చుకునేందుకు ఈ చిట్కాలను పాటించండి. ఫిష్ ఆయిల్: ఫిష్ ఆయిల్ ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు రాలే సమస్యను నివారిస్తు

  • Do you know why you sweat profusely after consuming alcohol?

    Alcohol: మద్యం సేవించినప్పుడు ఎక్కువగా చెమట ఎందుకు పడుతుందో తెలుసా…?

  • Is your hair thinning? Try following these tips!

    Thin Hair: జుట్టు పలచబడిందా..? ఈ చిట్కాలు పాటించి చూడండి..!!

  • Excessive intake of Vitamin D is dangerous.

    Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

Latest News

  • White Bedsheets: హోటల్స్‌లో వైట్ కలర్ బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ ఎందుకు వాడతారో మీకు తెలుసా?

  • Hormone: బెల్లీ ఫ్యాట్ పెరుగుతుందంటే ఈ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లే..!

  • LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

Trending News

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd