Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గించుకోండిలా!
రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా 20 నిమిషాలు నడవాలి. ఊబకాయం తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ డిన్నర్ తర్వాత 20 నిమిషాల పాటు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
- By Gopichand Published Date - 09:53 PM, Sat - 18 October 25

Weight Loss Tips: సాధారణంగా ఎక్కువ కాలం పాటు ఉండే ఊబకాయం (Weight Loss Tips) మొండి కొవ్వు (Stubborn Fat)గా మారుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే పెరుగుతున్న బరువును వెంటనే అదుపులోకి తీసుకురావడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు బరువు పెరగడం సమస్యతో బాధపడుతున్నా లేదా తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపించినా పొట్టపై కొవ్వు (Belly Fat) పెరుగుతున్నా కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను తప్పకుండా పాటించాలి. ఎక్కువసేపు కూర్చోవడం, ఆలస్యంగా రాత్రి భోజనం చేయడం, తిన్న వెంటనే పడుకోవడం వల్ల పొట్ట త్వరగా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో మీరు కేవలం కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా బరువు తగ్గవచ్చు.
కేవలం 2 వారాలు అంటే 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను తగ్గించడానికి డైటీషియన్ కొన్ని చిట్కాలు చెప్పారు. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతారు. ఆ 3 చిట్కాల గురించి తెలుసుకుందాం!
ఈ 3 అలవాట్లు పాటించండి
త్వరగా రాత్రి భోజనం చేయండి
పొట్ట తగ్గించుకోవడానికి, బరువు తగ్గడానికి రాత్రి భోజనం త్వరగా చేయండి. మీరు రాత్రి 7 గంటలలోపు డిన్నర్ పూర్తి చేయాలి. దీనితో పాటు రాత్రి భోజనంలో కార్బోహైడ్రేట్లను (Carbohydrates) తగ్గించండి. ఇలా చేయడం వల్ల కొవ్వు నిల్వ చేసే హార్మోన్లు (Fat Storage Hormones) అదుపులో ఉంటాయి. రాత్రిపూట జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
డిన్నర్ తర్వాత నడక
రాత్రి భోజనం చేసిన తర్వాత తప్పకుండా 20 నిమిషాలు నడవాలి. ఊబకాయం తగ్గించడానికి ఇది ఉత్తమ మార్గంగా పరిగణించబడుతుంది. ప్రతిరోజూ డిన్నర్ తర్వాత 20 నిమిషాల పాటు తేలికపాటి నడక రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar) నియంత్రిస్తుంది. అర్ధరాత్రి వచ్చే ఆకలి కూడా తగ్గుతుంది.
Also Read: Diwali: దీపావళి ఏ రోజు జరుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?
పడుకునే ముందు హెర్బల్ టీ తాగండి
దీనితో పాటు రాత్రి పడుకునే ముందు తప్పకుండా ఏదైనా హెర్బల్ టీ తాగాలి. హెర్బల్ టీ తాగడం వల్ల పొట్ట ఉబ్బరం సమస్య తగ్గుతుంది. పొట్ట వాపు (Abdominal Swelling) తగ్గుతుంది. దీని కోసం మీరు ఇంట్లోనే ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవచ్చు.
హెర్బల్ టీ ఎలా తయారు చేయాలి?
దీని కోసం 1 కప్పు వేడి నీటిలో కొద్దిగా సోంపు, జీలకర్ర, వాము (Ajwain) వేయండి. ఇందులో కొద్దిగా తురిమిన అల్లం, చిటికెడు పసుపు, నల్ల మిరియాలు (Black Pepper) కూడా వేయండి. దీనిని 5 నిమిషాలు ఉడికించి, వడకట్టి, నిమ్మరసం కలిపి వేడిగా తాగండి. ఈ టీ తాగడం వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్య, వాపు, మంట తగ్గుతాయి.