HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Tirumala Special Entrance Darshan Tickets Will Be Released On 9th Of This Month

Tirumala : ఈ నెల 9న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మాదిరిగానే

  • Author : Vamsi Chowdary Korata Date : 07-01-2023 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD Devotees
Tirumala Srivari Income In 2022 Is Rs.1,320 Crores Ttd

శ్రీవారి భక్తులకు తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మాదిరిగానే పది రోజుల ముందే మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లు టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. అయితే జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది‌ రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం‌ కల్పచాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుంచి 11వ తారీఖు వరకూ సంబంధించిన టోకెన్లను టీటీడీ‌ జారీ చేసింది. అయితే 12వ తేదీ నుంచి మిగిలిన రోజుల ప్రత్యేక‌ ప్రవేశ టోకెన్లను టీటీడీ పెండింగ్ పెట్టింది. అయితే  జనవరి 12వ తేదీ నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై వేల చొప్పున ఈ‌నెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని‌ సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఆన్లైన్ లింక్: http://tirupatibalaji.ap.gov.in

శ్రీవారి దర్శనం టికెట్లు:

కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన వేంకటేశ్వరస్వామి వారిని జన్మలో ఒక్కసారైనా దర్శించాలని‌ భక్తులు భావిస్తూ ఉంటారు. ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దర్శన భాగ్యం కోసం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు (Tirumala) చేరుకుంటారు. అయితే ఇలా చేరుకున్న భక్తులకు వివిధ మార్గాల్లో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది.  అయితే వేకువజామున సుప్రభాత సేవ మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకూ ఏడుకొండల వెంకన్న క్షణం తీరిక లేకుండా సేవలు నిర్వహిస్తారు. వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే ధనవంతుల నుంచి సామాన్య భక్తుల వరకూ ఎటువంటి లోపం జరగకుండా టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి‌ దర్శన భాగ్యం కల్పించేందుకు టైం స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తే, మరికొందరికి ఆన్లైన్ విధానం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ టోకెన్లు, అంగ ప్రదక్షణ టోకెన్లు, సీనియర్ సిటీజన్ టోకెన్లను ప్రతి నెల భక్తులకు అందుబాటులో‌ ఉంచుతుంది. దీంతో ముందుస్తుగా టోకెన్లు పొందిన భక్తులు సకాలంలో స్వామి వారి దర్శనం‌ పొందే విధానం టీటీడీ చర్యలు తీసుకుంటుంది.

వైకుంఠ ద్వార దర్శనాలు:

తిరుమలలో‌ వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తుంటారు. గురువారం రోజున 47,781 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 15,695 మంది తలనీలాలు సమర్పించగా, 2.10 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.  తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు వైకుంఠ ద్వార దర్శనంను టీటీడీ భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తుంది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే స్వామి వారి‌ దర్శనంకు రావాలని టీటీడీ ప్రకటించడంతో టోకెన్లు పొందిన‌వారు మాత్రమే తిరుమల యాత్రకు వెళ్తున్నారు. దీంతో భక్తులు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం పొందుతున్నారు.

Also Read:  Uttarayanam 2023 : కాలాల్లో ఉత్తరాయణమే పుణ్యకాలం ఎందుకంటే..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • god
  • Lord
  • Srivari Darshanam
  • tirumala
  • Tirupati
  • ttd

Related News

Why should a husband and wife stay apart during the month of Ashadha?

Ashada Masam 2026: ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఎందుకు దూరంగా ఉండాలి?

హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు ఉండనుంది. ఈ మాసం రాగానే కొత్తగా పెళ్లైన దంపతులను ఒకరికొకరు దూరంగా ఉంచడం, వధువును పుట్టింటికి పంపించడం మన సమాజంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అయితే దీని వెనుక కేవలం సెంటిమెంట్లు, నమ్మకాలు మాత్రమే కాకుండా పూర్వీకులు ఆలోచించిన అద్భుతమైన వైజ్ఞానిక, సామాజిక కారణాలు దాగి ఉన్న

  • Why is *Thamboolam* (betel leaves and areca nuts) offered? On what occasions is it given? What is its significance?

    Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

  • Is this what the abode of Lakshmi looks like?

    Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd