HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Srivari Devotees Are Angry With Ttd Officials In Tirumala

Tirumala TTD : తిరుమలలో టీటీడీ అధికారుల పై శ్రీవారి భక్తుల ఆగ్రహం

దర్శనానికి అనుమతించక పోవడంతో మ్యూజియం (Museum) వద్ద శ్రీవారి భక్తులు నిరసనకు దిగారు. మంగళవారం

  • Author : Vamsi Chowdary Korata Date : 27-12-2022 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Ttd
Tirumala Ttd

కలియుగ దైవం తిరుమల (Tirumala) శ్రీవారి సన్నిధిలో భక్తులు ధర్నాకు దిగారు. దర్శనానికి అనుమతించక పోవడంతో మ్యూజియం వద్ద శ్రీవారి భక్తులు నిరసనకు దిగారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా శ్రీవారి దర్శనం ఈ 27న ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఆలయ శుద్ది అనంతరం ఉదయం 11 గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు భక్తులను అనుమతించనున్నారు. కానీ విషయం ముందే తెలపకపోవడంతో సోమవారం రాత్రి సమయానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులతో పూర్తిగా నిండి పోయింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ కు వెలుపల ఉన్న భక్తులను క్యూ లైన్ల లోనికి టిటిడి సిబ్బంది అనుమతించడం లేదు.

సమాచార లోపంతో వైకుంఠం క్యూ లైన్స్ వద్దకు చేరుకున్న భక్తులు ఆందోళన చేస్తున్నారు. దాంతో టిటిడి విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగారు. విజిలెన్స్ అధికారులు సర్ధి చెప్పడంతో భక్తులు శాంతించారు. శ్రీవారి దర్శనానికి ముప్పై గంటల సమయం పడుతుందని టిటిడి ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం రాత్రి క్యూ లైన్స్ లోకి భక్తులను అనుమతించడం లేదని టిటిడి విజిలెన్స్ అధికారులు భక్తులకు తెలిపారు.

జనవరి 1 నుంచి వైకుంఠ ద్వార సర్వదర్శనం టికెట్లు జారీ

తిరుమలలో (Tirumala) టీటీడీ అధికారులతో కలిసి వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు.  అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని ఈవో చెప్పారు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు 2 లక్షలు కేటాయించినట్టు తెలిపారు. తిరుపతిలో అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న విష్ణునివాసం, రైల్వేస్టేషన్‌ వెనుక ఉన్న 2, 3 సత్రాలు, ఆర్‌టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్‌, ఇందిరా మైదానం, జీవకోన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, భైరాగిపట్టెడలోని రామానాయుడు మున్సిపల్‌ హైస్కూల్‌, ఎంఆర్‌ పల్లి జడ్‌పీ హైస్కూల్‌, రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేస్తున్న కౌంటర్లలో జనవరి 1న సర్వదర్శనం టోకెన్ల జారీ  ప్రారంభిస్తామన్నారు.

జనవరి 1న ఆఫ్‌లైన్ విధానంలో తిరుపతిలో టీటీడీ టోకెన్లను కేటాయించనుంది. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకు 50 వేల చొప్పున 5 లక్షల టిక్కెట్లను టీటీడీ కేటాయించింది. భక్తులు ఈ టికెట్లను పొందొచ్చు. జనవరి 1న సర్వదర్శనం టికెట్ల జారీ ఉంటుంది. అంతేకాదు వైకుంఠ ద్వార దర్శనం జరిగే పది రోజులు సామాన భక్తులకు ప్రాధాన్యం ఇస్తామని టీటీడీ చెబుతోంది. ప్రతిరోజూ 2000 మంది దాతలు తమ దర్శన కోటాను కూడా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వైకుంఠ ఏకాదశికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే దర్శన టిక్కెట్లు కేటాయిస్తారు. సిఫార్సు లేఖలు తీసుకోరు.

Also Read:  Jupiter : గురు గ్రహ ఫలాలు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు కలిగే ఫలితాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • angry
  • devotees
  • devotional
  • Officials
  • tirumala
  • Tirupati
  • ttd

Related News

    Latest News

    • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

    • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

    • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

    • IPL 2026 – CSK : సంజూను కెప్టెన్ చేయాలంటూ డిమాండ్ !

    • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

    Trending News

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

      • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

      • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

      • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd