HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Koti Deepotsavam In Hyderabad

Koti Deepotsavam 2023: దేదీప్యమానంగా వెలిగిపోతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవ కార్యక్రమం

మాములుగా దీపావళి పండుగ తర్వాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. కార్తీకమాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-11-2023 - 2:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koti Deepotsavam 3
Koti Deepotsavam 3

Koti Deepotsavam 2023: మాములుగా దీపావళి పండుగ తర్వాత కార్తీకమాసం మొదలవుతుంది. ఈ కార్తీకమాసంలో ఎక్కడ చూసినా కూడా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తూ ఉంటుంది. కార్తీకమాసం అంటే శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది. ఈ మాసంలో ఆలయాలన్ని దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా శివాలయాలు ఈ కార్తీక మాసం మొత్తం దీపాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే దాదాపుగా పది సంవత్సరాలుగా కార్తీకమాసంలో హైదరాబాద్‌లో కోటీ దీపోత్సవం కార్యక్రమంని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. న్యూస్‌ చానెల్‌ ఎన్టీవీ, భక్తిటీవీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్‌ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. భక్తి టీవీ ఎన్ టీవీ ఆధ్వర్యంలో దాదాపుగా 14 రోజులపాటు ఈ కోటి దీపావస్వామి కార్యక్రమం జరగనుంది. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను ఒక్క వేదిక మీదకు తెచ్చే పవిత్ర ప్రయోగమే ఈ కోటిదీపోత్సవం. వేల,లక్షల సంఖ్యలో భక్తులు,వేద పండితులు, అతిథులు, అతిరథ మహారధుల మధ్య ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం వైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రతిరోజూ పంచుతుంది దీపోత్సవం కార్యక్రమం.

ఈ 14 రోజులపాటు ఈ ప్రాంగణం అంతా కూడా శివనామ స్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. ఎక్కడినుంచో వేలాదిమంది భక్తులు తరలివచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుని ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగలు, ఆధ్యాత్మికవేత్తల సందేశాలతో కోటిదీపోత్సవ వేదిక ఒక ఆధ్యాత్మిక దివ్యఅనుభూతికి నిలయంగా మారుతుంది. అన్నిటికంటే మించి భక్తులు అందరూ ఎంతగానో ఎదురు చూసే సందర్భం దేదీప్యమాన దృశ్యం. కోటి కాంతుల ఒకేసారి ప్రసరించే దివ్య అనుభవం దీప ప్రజ్వలనం. అలా ఒకటి రెండు దీపాలు కాదు ఏకంగా కోటి దీపాల వెలుగుల మధ్య ఆ పరమేశ్వరుడికి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. మన సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి కూడా తెలిసే విధంగా 2013 నుంచి భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. అయితే ఈ ఏడాది అనగా 2023 నవంబర్ 14 న మొదలయ్యి నవంబర్ 27 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం జరగనుంది.

Also Read: Bethavolu Canal : ఊడిన బేతవోలు కాలువ షట్టర్‌..చేతికందిన పంట నీట మునిగే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhakthi TV
  • hyderabad
  • Koti Deepotsavam 2023
  • NTR Stadium
  • Pancha Bhoota Linga

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

  • Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd