RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజట్లు పోటీ
- Author : Prasad
Date : 31-05-2026 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఈ కీలక పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు 2022 ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తమ రెండో ట్రోఫీ కోసం పోరాడుతోంది . ఈ సీజన్ మొత్తం గుజరాత్ విజయాల్లో కెప్టెన్ శుభమన్ గిల్, సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించారు. టాప్ ఆర్డర్ నిలకడగా రాణించడం జట్టుకు ప్రధాన బలం. బౌలింగ్‌లో రబడ, సిరాజ్, రషిద్ ఖాన్‌లతో గుజరాత్ బలంగా ఉంది. గత సీజన్ టైటిల్‌ను నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఆర్‌సీబీ బరిలోకి దిగింది.విరాట్ కోహ్లి, హజెల్‌వుడ్ వంటి స్టార్ ఆటగాళ్లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.