HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Meets Aicc Chief Kharge

Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Author : Prasad Date : 31-05-2026 - 4:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T Congress
T Congress

ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శంషాబాద్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో జ‌రిగిన ఈ స‌మావేశంలో తెలంగాణ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షీన‌ట‌రాజ‌న్‌, డిప్యూటీ సీఎం భ‌ట్టి, పీసీసీ చీఫ్ మ‌హేష్‌కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు గంటన్నర పాటు కొనసాగింది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా వెళ్తున్న సందర్భంగా ఖర్గే హైదరాబాద్‌లో ఆగగా, ఈ సమావేశం జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) వెల్లడించింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రవేశపెడుతున్న ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ పథకాన్ని ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయనున్నారు. ట్రస్ట్‌లో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉండగా, ఉద్యోగుల సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల సంఘాల నుంచి ఇద్దరు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తారు. 3.56 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. ఈ పథకం కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, 652 ఎంపానెల్‌డ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి క్యాష్‌లెస్ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం 1,998 వైద్య ప్రక్రియలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఉద్యోగులు తమ మూల వేతనంలో 1.5 శాతం చొప్పున వాటా చెల్లించనుండగా, ప్రభుత్వం కూడా సమాన మొత్తాన్ని జమ చేస్తుంది. ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.1,056 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • AICC President Kharge
  • CM Revanth Reddy
  • telangana
  • telangana pradesh congress committee (tpcc)

Related News

We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

Revanth Warning : రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు CM రేవంత్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR - Special Intensive Revision) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

  • KTR warns CM Revanth

    KTR: సీఎం రేవంత్‌కు కేటీఆర్ వార్నింగ్

  • Smart Ration Cards in Telangana

    Ration Card: తెలంగాణలో స్మార్ట్ రేషన్‌ కార్డులు

  • Good news for liquor lovers in Telangana.

    Hyderabad: తెలంగాణలో మద్యం ప్రియులకు గుడ్‌ న్యూస్‌

  • New pensions... Minister Seethakka shares good news for single women.

    Telangana Pensions: కొత్త పెన్షన్లు.. ఒంటరి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd