ప్రభాస్ ది రాజా సాబ్ మూడు రోజుల కలెక్షన్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 12-01-2026 - 4:33 IST
Published By : Hashtagu Telugu Desk
The Raja Saab 3 Day Worldwide Box Office Collections పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ.112 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ఈ చిత్రం, మూడో రోజుకు ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. “A festival treat turned BOX OFFICE CARNAGE” అంటూ People Media Factory షేర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ థియేటర్ రెస్పాన్స్ బలంగా కొనసాగుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ ది రాజా సాబ్ ’ బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్‌తో సందడి చేస్తున్న ఈ సినిమా, టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా అంచనాలను మించిపోయింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్–కామెడీ ఫాంటసీ జానర్‌లో ప్రభాస్‌ను ఫుల్ ఎంటర్‌టైనర్ మోడ్‌లో చూడటం అభిమానులకు పండగలా మారింది. ప్రభాస్ సినిమా విడుదలవుతుందంటే అది అభిమానులకు మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలకు, సాధారణ ప్రేక్షకులకు కూడా పండగలాంటిదే. ముఖ్యంగా ‘కల్కి 2898 AD’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ‘ది రాజా సాబ్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు మారుతి హారర్–కామెడీ జోనర్‌లో ప్రభాస్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తాడన్న ఆసక్తి కూడా సినిమాపై హైప్‌ను భారీగా పెంచింది. ముఖ్యంగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, మాస్ ఎలివేషన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ ఈ చిత్రం ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది. “KING SIZE BOX OFFICE DOMINATION” అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హారర్ ఫాంటసీ జానర్‌లో తొలి రోజే ఇంత భారీ ఓపెనింగ్స్ సాధించడం ఇదే తొలిసారి అని, ఈ కేటగిరీలో ‘ది రాజా సాబ్’ కొత్త రికార్డు సృష్టించిందని వారు వెల్లడించారు. అయితే ఫస్ట్ డే తర్వాత మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయిన్లు వార్తలొచ్చినా అవన్నీ నిజం కాదని తాజా లెక్కలు నిరూపిస్తున్నాయి. తాజాగా మేకర్స్ మూడు రోజుల కలెక్షన్లను కూడా అధికారికంగా ప్రకటించారు. “A festival treat turned BOX OFFICE CARNAGE” అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. సంక్రాంతి పండగ వారం మొదలవుతున్న తరుణంలో ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ లభిస్తోందని కూడా వారు పేర్కొన్నారు.
మూడు రోజుల్లోనే ఈ స్థాయి కలెక్షన్లు నమోదు కావడంతో, నాలుగో రోజు సినిమాకు మరింత ఊపు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పండగ సెలవులు, ఫ్యాన్స్ హంగామా కొనసాగుతున్న నేపథ్యంలో ‘ది రాజా సాబ్’ నాలుగో రోజే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టాక్ ఎలా ఉన్నా… ప్రభాస్ మార్కెట్ పవర్ ముందు బాక్సాఫీస్ లెక్కలు మరోసారి తలవంచాల్సి వచ్చిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.