Nivetha Pethuraj: బ్రేకప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న నివేదా పేతురాజ్!
- Author : Vamsi Chowdary Korata
Date : 14-04-2026 - 3:35 IST
Published By : Hashtagu Telugu Desk
మెంటల్ మదిలో, చిత్రలహరి వంటి చిత్రాలతో టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్న నివేదా పేతురాజ్ వ్యక్తిగత కారణాలతో సినిమాలకు విరామం ఇచ్చి ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది. ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ నటి, బిజినెస్ మేన్ రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడి 2023లో వెండితెరకు దూరమయ్యింది.
పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇద్దరూ హింట్ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. తాజాగా రజిత్ మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో, నివేదా తన గతాన్ని వదిలేసి మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వాలని నిర్ణయించుకుంది. గతంలో స్టార్ హీరోలతో నటించిన నివేదా… ఇప్పుడు కథలో ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రలోనైనా (క్యారెక్టర్ రోల్స్) నటించడానికి సిద్ధమని మేకర్స్‌కు సందేశాలు పంపుతున్నట్టు సమాచారం.
ప్రేమ కోసం, ఎదుగుతున్న కెరీర్‌ను పణంగా పెట్టిన నివేదా పరిస్థితిని చూసి నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిభ ఉన్న నటి కాబట్టి ఆమెకు మంచి కమ్‌బ్యాక్ లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.