Mohan Babu Apology: తగ్గిన మోహన్ బాబు.. క్షమాపణలు చెబుతూ లేఖ!
మంచు మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య గొడవలైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్ద రెండు రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
- By Gopichand Published Date - 09:02 AM, Fri - 13 December 24

Mohan Babu Apology: నటుడు మోహన్ బాబు (Mohan Babu Apology) ఇటీవల మీడియాపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జర్నలిస్టు సంఘాల నుంచే కాకుండా.. ప్రజా సంఘాల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా మోహన్ బాబు ఓ లేఖ విడుదల చేశారు. మీడియా ప్రతినిధిపై తాను చేసిన దాడికి క్షమాపణలు కోరుతున్నానని లేఖలో పేర్కొన్నారు. గాయపడిన బాధిత జర్నలిస్టు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
రిపోర్టర్ రంజిత్, మొత్తం TV9 కుటుంబ సభ్యులను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు మంచు మోహన్ బాబు ఓ నోట్ విడుదల చేశారు. గాయపడిన రంజిత్ త్వరగా కోలుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆవేశపూరిత క్షణంలో నా స్పందన ఒక వ్యక్తి గాయానికి దారితీసినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read: Rohit Sharma: జైస్వాల్ మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీరియస్ అయిన రోహిత్
Mohan Babu apologizes to TV9 and journalist Ranjith
"To Mr. Ranjith and the entire TV9 family, I sincerely apologize for my actions, which have caused pain and distress, and I extend my heartfelt wishes for a speedy recovery. I deeply regret that my response in the charged… https://t.co/jU2jHJPvIO pic.twitter.com/D8wT5uscta
— idlebrain.com (@idlebraindotcom) December 13, 2024
అసలేం జరిగిందంటే?
మంచు మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య గొడవలైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్ద రెండు రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంచు మనోజ్‌ను మోహన్ బాబు సెక్యూరిటీ ఇంట్లోకి అనుమతించకపోవడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. ఈ సమయంలోనే మనోజ్, అతని సిబ్బంది మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీని బలవంతంగా ఓపెన్ చేశాడు. అయితే మనోజ్ ఇంట్లోకి వెళ్లిన ఐదు నిమిషాలకే చిరిగిన చొక్కాతో బయటకు వచ్చి మీడియాను సైతం మరోసారి తన వెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మనోజ్ తన ఇంట్లోకి వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు.
టీవీ9 జర్నలిస్ట్ రంజిత్ మైక్ లాక్కుని ఆయనపైనే దాడి చేశారు. ఈ దాడిలో మరో జర్నలిస్ట్ కూడా గాయపడ్డాడు. అయితే జర్నలిస్ట్ రంజిత్‌కు చెవి భాగంలో తీవ్ర గాయం కావడంతో సర్జరీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలోనే మోహన్ బాబు సైతం వ్యక్తిగత సమస్యలతో ఆస్పత్రి పాలై గురువారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి వచ్చిన మోహన్ బాబు శుక్రవారం ఉదయం క్షమాపణలు చెబుతూ ఓ నోట్ విడుదల చేశారు.