Mahesh Babu posts: సూపర్ స్టార్ కృష్ణపై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
మహేష్ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు.
- Author : Gopichand
Date : 24-11-2022 - 6:19 IST
Published By : Hashtagu Telugu Desk
మహేష్ బాబు తాజాగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మృతిపై ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ట్విట్టర్ లో ఈ విధంగా పోస్ట్ చేశాడు. మీ జీవితం ఎప్పుడూ పండుగలానే సాగింది. మీ అంతిమ యాత్ర కూడా అలానే సాగింది. అదే మీ గొప్పదనం. ఏ భయం లేకుండా బతికారు. డేరింగ్ డాషింగ్ అనేది మీ వ్యక్తిత్వం. మీరే నాకు స్పూర్తి.. నా ధైర్యం. అదే మీ నుంచి నేను నేర్చుకున్నాను..మిమ్మల్ని చూస్తూ పెరిగాను. ఇప్పుడు నాలో ఉన్న ఈ ధైర్యం, బలం ఇది వరకు ఎన్నడూ నేను అనుభవించలేదు.
ఇమీ కాంతి, మీ శక్తి ఎప్పుడూ నాలోనే ఉంటుందని ఇప్పుడు నేను ఏ భయం బెరుకూ లేకుండా చెప్పగలను. మీ వారసత్వాన్ని, మీ గౌరవాన్ని, మీ పరువు ప్రతిష్టలను నేను ముందుకు తీసుకెళ్తాను నాన్నా. మీరు ఇంకా గర్వపడేలా చేస్తాను నాన్నా.. లవ్ యూ నాన్నా.. మీరే నా సూపర్ స్టార్ అంటూ మహేష్ బాబు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.
మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ ఈ ఆదివారం నాడు జె.ఆర్.సి. కన్వెన్షన్ లో జరుగుతున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు, అతని చిన్నాన్న ఆదిశేషగిరి రావు రానున్నారు. అలాగే అదే రోజు కృష్ణ, మహేష్ బాబు అభిమానులను సూపర్ స్టార్ స్వయంగా కలిసే అవకాశం ఉంది.
— Mahesh Babu (@urstrulyMahesh) November 24, 2022