HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Is This The Secret Behind The Name Luger For Jr Ntr

Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-05-2026 - 3:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Is this the secret behind the name 'Luger' for Jr. NTR?
Is this the secret behind the name 'Luger' for Jr. NTR?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ పాత్ర పేరును ‘లూగర్’గా పరిచయం చేయడం అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో హీరోల పేర్లను శక్తిమంతంగా తీర్చిదిద్దుతారన్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’లో రాకీ, ‘సలార్’లో దేవా మాదిరిగానే ‘డ్రాగన్’లో ఎన్టీఆర్ పాత్రకు ‘లూగర్’ అనే పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ‘లూగర్’ అనేది ప్రపంచ యుద్ధాల కాలంలో జర్మనీ సైన్యం వాడిన ఒక క్లాసిక్ పిస్టల్. అత్యంత కచ్చితమైన లక్ష్యానికి, ప్రాణాంతకమైన వేగానికి ఇది ప్రసిద్ధి. ఈ నేపథ్యంలో సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం ఒక వ్యక్తిలా కాకుండా, శత్రువులను వేటాడే ఆయుధంలా ఉండబోతోందని ఈ పేరు సూచిస్తోంది. కాగా, ఈ విష‌యంపై చిత్ర‌బృందం ఇంకా స్పందించ‌లేదు. అయితే, ‘లూగ‌ర్’ అనే ప‌దానికి గూగుల్, వీకిపిడియాలో మాత్రం ఈ అర్థం క‌నిపిస్తుంది.

ఈ చిత్రం 1967 కాలం నాటి అంతర్జాతీయ ఓపియం (నల్లమందు) స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లాక, ఓపియం వ్యాపారం ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’, ‘గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ’లుగా విడిపోతుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఆధిపత్య పోరు, రక్తపాతం చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ఎన్టీఆర్ ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’కి చెందిన ‘అసాసిన్-ఇన్-చీఫ్’గా కనిపించనున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత కథానాయికగా నటిస్తుండగా, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ ‘రఘువీర్ రాథోడ్’ అనే కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్ప‌టికే అధికారికంగా ప్రకటించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Director Prashanth Neel
  • jr ntr
  • Jr NTR birthday
  • Luger
  • NTR - Prashanth Neel
  • ntr dragon look
  • ntr dragon movie
  • ntr dragon updates
  • NTR Dragone
  • NTR Prashanth Neel Movie
  • NTR31
  • Rukmini Vasanth

Related News

    Latest News

    • AI Data Center : మెటా, రిలయన్స్ చారిత్రాత్మక ఒప్పందం..గుజరాత్‌లో ‘ఏఐ డేటా సెంటర్’

    • Evening Puja : సాయంత్రం దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రాలు పఠించండి.. అదృష్టం కలిసి వస్తుంది..!!

    • Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

    • Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

    • Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd