NTR Video: సీఎం రేవంత్ ఎఫెక్ట్.. మొన్న ప్రభాస్, నేడు ఎన్టీఆర్!
టాలీవుడ్ స్టార్ హీరోలు డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ 30 సెకన్ల వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
- By Gopichand Published Date - 12:18 AM, Fri - 3 January 25

NTR Video: టాలీవుడ్ స్టార్ హీరోలు డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలంగాణ ప్రభుత్వానికి మద్దతుగా డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ 30 సెకన్ల వీడియోను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అందులో యంగ్ రెబల్ స్టార్ మనకు ఎన్నో అలవాట్లు ఉండగా.. ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్స్ అని చెప్పటంతో ఆయన అభిమానులు కూడా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా మరో స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR Video) కూడా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియో విడుదల చేశారు. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి అంటూ తారక్ తనదైన శైలిలో ప్రజలను హెచ్చరించారు.
🚨మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం, కొనటం, వినియోగించడం చేస్తుంటే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి సమాచారం అందించండి – ఎన్టీఆర్#NTR #JrNTR pic.twitter.com/rtiYUTpsbx
— Bharat Media (@Mediahub360_) January 2, 2025
సీఎం రేవంత్‌తో భేటీ తర్వాత టాలీవుడ్‌లో చలనం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల టాలీవుడ్ పెద్దలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశం తర్వాత ఇద్దరు స్టార్ హీరోలు ఈ విధంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పిలుపునివ్వటంతో సీఎం రేవంత్ ప్రభావం ఏదో ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ ప్రముఖులను డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వీడియోలు చేయాల్సిందిగా కోరారు. అలా చేస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంపు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇస్తామని మీడియా ముఖంగా చెప్పారు. అయితే సినిమా రిలీజుల సమయంలో హీరోలు తమ వంతుగా వీడియోలు రిలీజ్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని అందించేవారు.
Also Read: Pawan Kalyan: ఆ విషయంలో నాకు కక్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్
అయితే ఇటీవల అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పరిస్థితులు మారిపోయినట్లు స్పష్టంగా తెలుస్తోంది. టాలీవుడ్ పెద్దలతో భేటీ తర్వాత సీఎం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి కూడా ప్రభుత్వానికి మద్దతు ఉండాలని, డ్రగ్స్, ఇతర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే టాలీవుడ్ స్టార్ల అవసరం ఉందని ఇటీవల బేటీలో ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీఎం షరతులకు టాలీవుడ్ సైతం ఓకే చెప్పినట్లు సమాచారం. ఆ ప్రకారమే స్టార్ హీరోలు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమాలు లేకపోయినా తమ వంతుగా డ్రగ్స్ వ్యతిరేక వీడియోలు చేశారని తెలుస్తోంది.