National Film Awards: అల్లు అర్జున్ కి సీఎం కేసీఆర్ అభినందనలు
జాతీయ చలన చిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిభావంతులకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రధానం చేస్తుంది
- By Praveen Aluthuru Published Date - 08:54 PM, Sat - 26 August 23

National Film Awards: జాతీయ చలన చిత్ర రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా ప్రతిభావంతులకు నేషనల్ ఫిల్మ్ అవార్డులు ప్రధానం చేస్తుంది. తాజాగా జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచుకున్న అభ్యర్థుల్ని ప్రకటించింది. అవార్డులు గెలుచుకున్న తారలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా వారిని కొనియాడుతూ హర్షం వ్యక్తం చేశారు. విలక్షణమైన నటనతో ఉత్తమ జాతీయ నటుడుగా అవార్డు దక్కించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. 69 ఏండ్లలో మొదటిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కడం గొప్ప విషయమని కొనియాడారు. ఈ సందర్భంగా బన్నీని సీఎం అభినందించారు. ఇది తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమని చెప్పారు సీఎం.
ఆస్కార్ అవార్డు గ్రహీత, రచయిత చంద్రబోస్ కు, ఉత్తమ సినీ సాహిత్యానికి గాను జాతీయ అవార్డు దక్కడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం.. చంద్రబోస్ కు శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.అలాగే ఉత్తమ సంగీత దర్శకుడు శ్రీ దేవిశ్రీ ప్రసాద్, ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ శ్రీ కాలభైరవ, ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులుతో పాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Also Read: AP : పవన్ కళ్యాణ్ ఫై పోటీ చేస్తారా..? పోసాని దిమ్మతిరిగే సమాధానం