చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
- Author : Vamsi Chowdary Korata
Date : 07-03-2026 - 1:41 IST
Published By : Hashtagu Telugu Desk
Chiranjeevi to Receive NTR National Award at Gaddar Film Awards 2025లో విడుదలైన చిత్రాలకు సంబంధించి ‘గద్దర్ ఫిలిం అవార్డ్స్-2025’ విజేతలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఈరోజు విజేతల పేర్లను ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవిని ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో సత్కరించనున్నారు. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలు, షార్ట్ ఫిలింలను పరిగణనలోకి తీసుకుని విజేతలను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 19న ఉగాది పర్వదినం సందర్భంగా అత్యంత వైభవంగా జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పురస్కారాలను అందజేయనున్నారు.
స్పెషల్ అవార్డులు:
- ఎన్టీఆర్ జాతీయ అవార్డు – చిరంజీవి
- ఏఎన్నార్ అవార్డు – జయసుధ
- పైడి జయరాజ్ అవార్డు – కమల్ హాసన్
- నాగిరెడ్డి చక్రపాణి అవార్డు – అశ్వనిదత్
ఫీచర్ ఫిల్మ్స్:
- ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
- ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
- ఉత్తమ తృతీయ చిత్రం – ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌షో
- ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
- ఉత్తమ నటి – రష్మిక (ది గర్ల్‌ఫ్రెండ్)
- ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ బాలనటుడు – మాస్టర్ రోహన్ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో)
- ఉత్తమ సహాయ నటుడు – శివాజీ
- ఉత్తమ సహాయనటి – భూమిక (యూఫోరియా)
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ – తండేల్
- ఉత్తమ సోషల్ మెసేజ్ సినిమా – కోర్ట్
- ఉత్తమ ప్రజాదరణ చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
- ఉత్తమ డాక్యుమెంటరీ – యూనిటీ
- బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ పరిచయ దర్శకుడు – సాయి మార్తాండ్ (లిటిల్ హార్ట్స్)
- ఉత్తమ బాలల చిత్రం – అనగనగా
- ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ రాబిన్ (దండోరా)
- ఉత్తమ గాయకుడు – అనురాగ్ కులకర్ణి (రాజు వెడ్స్ రాంబాయి)
- ఉత్తమ గాయని – సాహితీ (కన్నప్ప)
- ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే – అనిల్ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ లిరిసిస్ట్ – నందకిశోర్ (కుబేర)
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ ఎడిటర్ – శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్).
- ఉత్తమ సినీ గ్రంధం: ప్రభు (శూన్యం నుండి శిఖరాగ్రాలకు)
- ఉత్తమ సినిమా విమర్శకుడు: హెచ్ రమేశ్ బాబు