Chiranjeevi Donate: తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన మెగాస్టార్.. ఎంతంటే..?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించారు.
- By Gopichand Published Date - 09:39 AM, Wed - 4 September 24
Chiranjeevi Donate: తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సహాయక చర్యలు మొదలుపెట్టాయి. సీఎంలే స్వయంగా బరిలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఏపీలో సీఎం చంద్రబాబు గత రెండు మూడు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి అందుబాటులో ఉన్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ సైతం సమీక్షలు నిర్వహిస్తూ వరద ప్రభావిత బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వరద బాధితులకు టాలీవుడ్ సినీ స్టార్లు తమ వంతుగా డబ్బు సాయం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళంగా (Chiranjeevi Donate) ప్రకటిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
Also Read: Telangana Rains : భద్రాచలం గోదావరి నీటిమట్టం 43 అడుగులు.. ఈ జిల్లాలకు వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.
మనందరం ఏదో…— Chiranjeevi Konidela (@KChiruTweets) September 4, 2024
ఈ క్రమంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఈ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే చిరంజీవి కంటే ముందుగా జూ ఎన్టీఆర్, బాలకృష్ణ, విశ్వక్ సేన్, జొన్నలగడ్డ సిద్ధూ, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, పలువురు నటులు తమ వంతుగా విరాళం ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన బర్త్ డే కానుకగా ఇంద్ర మూవీని రీరిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర మూవీలో యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో రానుంది.
Related News
East Godavari Accident : తూ.గో.లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు, పవన్‌లు సంతాపం
East Godavari Accident : తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి గ్రామ సమీపంలో జంగ్రెడ్డిగూడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో జీడిపప్పు తీసుకెళ్తున్న ఐషర్ లారీ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది.