Telangana Rains : భద్రాచలం గోదావరి నీటిమట్టం 43 అడుగులు.. ఈ జిల్లాలకు వర్షసూచన
మంగళవారం రాత్రి సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి, ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
- By Pasha Published Date - 09:28 AM, Wed - 4 September 24

Telangana Rains : తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు తెలంగాణవ్యాప్తంగా చాలా జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ ఖమ్మం, కొమురంభీం ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. రానున్న 3 గంటల్లో హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, జోగులాంబ గద్వాల్, వనపర్తి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు(Telangana Rains) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ కూడా మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ప్రజలు అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకటి , రెండు రోజుల్లోగా కుండపోత వర్షాల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. అయితే ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు తేలికపాటి వానలు కొనసాగుతాయని తెలిపింది. వరదలు తగ్గుముఖం పడితే ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఊరట లభిస్తుందని పేర్కొంది.
Also Read :Become Rich: 43 రోజులపాటు ఇలా చేస్తే ధనవంతులవుతారు.. ఏం చేయాలంటే..?
మంగళవారం రాత్రి సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, యాదాద్రి, ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. కోహెడ (సిద్దిపేట)లో 22.3 సెంటీమీటర్లు, అబ్దుల్లాపూర్ (నిర్మల్)లో 19.8 సెం.మీ, తొండకూరు (నిజామాబాద్)లో 16.2 సెం.మీ, అకెనపల్లి (పెద్దపల్లి)లో 12.7 సెం.మీ, వెంకిర్యాల (యాదాద్రి)లో 10.6 సెం.మీ, జైనూర్ (ఆసిఫాబాద్)లో 9 సెం.మీ, సింగపూర్‌టౌన్ (మేడ్చల్)లో 8.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈసారి ఎడతెరిపి లేని వర్షాలతో ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది.