Allu Arjun Blocks Heroine: వరుడు సినిమా హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. కారణమేంటి..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ఎలాంటి వార్త వచ్చిన అది ట్రెండ్ అయిపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ వార్తల్లో నిలిచారు.
- By Gopichand Published Date - 10:43 AM, Mon - 20 March 23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ఎలాంటి వార్త వచ్చిన అది ట్రెండ్ అయిపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ వార్తల్లో నిలిచారు. ఆయన తను గతంలో నటించిన ఓ హీరోయిన్‌ను బ్లాక్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇంతకు బన్నీ బ్లాక్ చేసిన ఆ నటి ఎవరో కాదు.. ఆయన నటించిన వరుడు సినిమా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా.
ట్విటర్‌లో ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేశారు. ఇదే విషయాన్ని భానుశ్రీ తెలియజేస్తూ బన్నీ బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారంటూ పోస్టు కూడా పెట్టింది. “మీరు ఎప్పుడైనా కష్టాల్లో కూరుకుపోయారని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అల్లు అర్జున్‌తో వరుడులో నటించాను. కానీ ఇప్పటికీ నాకు ఎలాంటి ఆఫర్లు రాలేదు. నేను నా పోరాటంలోనూ హాస్యాన్ని, వినోదాన్ని కనుగొన్నాను. నేర్చుకున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విటర్‌లో బ్లాక్ చేశారు. అయినా సరే వెళ్లి నా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి” అని భానుశ్రీ ట్వీట్ చేసింది.
https://twitter.com/IAmBhanuShree/status/1636984685321416705?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1636984685321416705%7Ctwgr%5E352cdd3cea145dc0eb2b1d8bdcce1e28df5f2a0e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.hindustantimes.com%2Fentertainment%2Fallu-arjun-blocks-his-heroine-bhanu-shree-mehra-in-twitter-121679133107388.html
Also Read: Ram Charan: బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. టాలెంట్ లేకపోతే నెట్టుకు రావడం కష్టం: రామ్ చరణ్
అయితే కొంత సమయం తర్వాత బన్నీ తనను అన్ బ్లాక్ చేశాడని భానుశ్రీ తెలిపింది. అల్లు అర్జున్ ఆమెను ఎందుకు బ్లాక్ చేశారనేదానిపై స్పష్టత లేదు. అయితే ఎక్కువ మంది స్పామ్ కారణంగానే ఆమెను బ్లాక్ చేశారని భావిస్తున్నారు. ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భానుశ్రీ మెహ్రా తెలుగులో వరుడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా, రన్, మిస్ ఇండియా లాంటి పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.
అయితే నటి చేసిన ట్వీట్ చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. కొందరు అయితే.. స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్‌కు చిన్న నటులపై గౌరవం పోయిందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో భానుశ్రీపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. అప్పట్లో వరుడు టీమ్ చిత్రానికి వైవిధ్యంగా ప్రమోషన్ నిర్వహించింది. సినిమా విడుదలయ్యే వరకు కూడా హీరోయిన్ ఎవరో ఎక్కడా విడుదల చేయలేదు. చివరి వరకు సస్పెన్స్ ఉంచి డైరెక్టుగా సినిమాలో పెళ్లి పీటలపై సన్నివేశంలో ఆమెను ముఖాన్ని రివీల్ చేశారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.