HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Rolls Royces Strategic Focus On India Preparations For Huge Investments

భారత్‌పై రోల్స్‌ రాయిస్‌ వ్యూహాత్మక దృష్టి..భారీ పెట్టుబడులకు సన్నాహాలు

ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి.

  • Author : Latha Suma Date : 30-12-2025 - 5:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rolls-Royce's strategic focus on India..preparations for huge investments
Rolls-Royce's strategic focus on India..preparations for huge investments

. దేశీయ విమానయాన రంగంలో కొత్త ఊపిరి

. శరవేగంగా విస్తరిస్తున్న దేశీయ విమానయాన విపణి

. రక్షణ రంగంలో ఇంజిన్‌ అభివృద్ధికి ప్రాధాన్యం

Rolls Royce: భారత్‌లో దేశీయ విమానయాన రంగం గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన వేగంతో వృద్ధి చెందుతోంది. ప్రయాణికుల సంఖ్య పెరగడం, కొత్త రూట్లు ప్రారంభం కావడం, విమానాశ్రయ మౌలిక సదుపాయాల విస్తరణ వంటి కారణాలతో ఈ రంగం ప్రపంచ స్థాయిలో కీలకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు 1200కు పైగా కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్‌లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి అనుగుణంగా ఇది దేశానికి మరింత పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకొచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

బ్రిటన్‌కు చెందిన విమాన ఇంజిన్‌ల తయారీ దిగ్గజం రోల్స్‌ రాయిస్‌ కూడా భారత్‌ను తమ ముఖ్యమైన గ్లోబల్‌ మార్కెట్లలో ఒకటిగా మార్చాలని యోచిస్తోంది. బ్రిటన్‌ వెలుపల తమ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు రోల్స్‌ రాయిస్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శశి ముకుందన్‌ వెల్లడించారు. జెట్‌ ఇంజిన్లు, నావల్‌ ప్రొపల్షన్‌, ల్యాండ్‌ సిస్టమ్స్‌, అడ్వాన్స్‌డ్‌ ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో భారత్‌లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ దిశగా భారీ పెట్టుబడుల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో రక్షణ, పారిశ్రామిక రంగాలు వేగంగా విస్తరిస్తుండటం తమకు విశ్వాసాన్ని కలిగిస్తోందని ముకుందన్‌ అన్నారు. భారత రక్షణ రంగంలో కీలకమైన అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) కార్యక్రమం కింద తయారయ్యే యుద్ధ విమానాల కోసం తదుపరి తరం ఏరో ఇంజిన్‌ల అభివృద్ధికి రోల్స్‌ రాయిస్‌ ప్రాధాన్యత ఇస్తోంది.

ఏఎంసీఏ ఇంజిన్‌ కోర్‌ను నావల్‌ మెరైన్‌ ఇంజిన్‌గా మార్చడమే కాకుండా, విద్యుత్‌ ప్రొపల్షన్‌ అవసరాలకు కూడా వినియోగించవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఏరో ఇంజిన్‌ను మెరైన్‌ ఇంజిన్‌గా మార్చగల సామర్థ్యం ఉన్న కొద్ది కంపెనీల్లో రోల్స్‌ రాయిస్‌ ఒకటిగా గుర్తింపు పొందింది. భారత నావికాదళ పోరాట సామర్థ్యాన్ని పెంచేలా విద్యుత్‌ ప్రొపల్షన్‌ పరిష్కారాల్లో కీలక పాత్ర పోషించగలదని సంస్థ భావిస్తోంది. ఇదే క్రమంలో భారత్‌లోని రెండు ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ముకుందన్‌ తెలిపారు. ఒక ఒప్పందం అర్జున్‌ ట్యాంక్‌ల ఇంజిన్‌ల తయారీకి సంబంధించగా, మరోది భవిష్యత్‌కు సిద్ధమైన కాంబాట్‌ వాహనాల ఇంజిన్‌ల అభివృద్ధి కోసం కుదుర్చుకోనున్నట్లు వెల్లడించారు. ఈ భాగస్వామ్యాల ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • britain
  • business
  • business news
  • Huge investments
  • india
  • Make In India
  • manufacturing facilities
  • New Planes
  • Rolls Royce

Related News

Indus Water

పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన భార‌త్‌!

పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

  • Interest Rates

    ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

  • Important Tasks

    డిసెంబర్ 31లోపు మ‌నం పూర్తి చేయాల్సిన ముఖ్య‌మైన‌ పనులు ఇవే!

  • Silver Price

    శుభ‌వార్త‌.. వెండి ధరల్లో భారీ పతనం!

  • Silver Price

    వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!

Latest News

  • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

  • మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

  • పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పై జరుగుతున్న ప్రచారానికి తెరదించిన ఉత్తమ్

  • బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత

  • ఫ్యాన్స్ గుడ్ న్యూస్ , రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి జరిగేది ఆ కోటలోనే !!

Trending News

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

    • టీమిండియా టీ20 జ‌ట్టుకు కాబోయే కెప్టెన్ ఇత‌నే!

    • మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd