HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Business
  • >Mark Zuckerberg Could Be Forced To Sell Both Instagram And Whatsapp

WhatsApp Sale: వాట్సాప్, ఇన్‌స్టాలను జుకర్‌బర్గ్‌ అమ్మేస్తారా ?

గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.

  • By Pasha Published Date - 04:01 PM, Mon - 14 April 25
  • daily-hunt
Mark Zuckerberg Instagram Whatsapp Sale Meta Facebook Antitrust Trial

WhatsApp Sale: వాట్సాప్‌ను నిత్యం మనమంతా వినియోగిస్తుంటాం. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈతరం కాలం గడిపేస్తుంటారు. ఈ రెండు యాప్స్ ప్రస్తుతం మెటా (ఫేస్‌బుక్) అధినేత మార్క్ జుకర్‌బర్గ్ చేతిలో ఉన్నాయి. ఈయన ఒక అమెరికన్. అమెరికాలో టెక్ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. టెక్నాలజీతో అమెరికా ప్రయోజనాలు దెబ్బతింటాయని చిన్న డౌట్ వచ్చినా.. లెక్కలన్నీ బయటికి తీస్తారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న టెక్ కంపెనీ యజమానిని అందరి ముందు కూర్చోబెట్టి ప్రశ్నలు సంధిస్తారు. అవసరమైన సమాధానాలన్నీ రాబడతారు. డౌట్స్ క్లియర్ అయ్యేదాకా సవాలక్ష సందేహాలన్నీ అడుగుతారు. దీన్నే లీగల్ భాషలో ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’ అంటారు. ప్రస్తుతం అమెరికాలో అతిపెద్ద యాంటీ ట్రస్ట్‌ ట్రయల్‌ను ఎదుర్కొంటున్న కంపెనీ.. మెటా (ఫేస్‌బుక్).  దీని పరిధిలోనే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లు ఉన్నాయి. ఈ రెండు కీలక యాప్స్‌ను జుకర్ బర్గ్ అమ్మేసే రేంజులో ఈరోజు(ఏప్రిల్ 14) సాయంత్రం నుంచే  ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’ జరగబోతోందట. జడ్జి జేమ్స్‌ బోస్‌బర్గ్‌ సారథ్యంలో ఈ విచారణ జరగనుంది.

Also Read :Blatant Mistake: షాకింగ్ పోలీసింగ్.. నిందితుడి బదులు జడ్జిని వెతికిన ఎస్సై

యాంటీ ట్రస్ట్‌ ట్రయల్‌ వర్సెస్ జుకర్‌బర్గ్.. ఏం జరగొచ్చు ?

  • గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది. చైనా ప్రభుత్వంతో జుకర్‌బర్గ్‌కు రహస్య డీల్స్ ఉన్నాయని ఆమె ఆరోపించారు. చైనా ప్రయోజనాలకు అనుగుణంగా ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను జుకర్ బర్గ్ నడుపుతున్నారని ఆరోపణ చేశారు.
  • మెటా(ఫేస్‌బుక్)పై 37 రోజుల పాటు యాంటీ ట్రస్ట్ ట్రయల్ జరుగుతుందట.
  • ఈ సుదీర్ఘ విచారణ  జరిగే క్రమంలో  మెటాపై అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (US FTC) వివిధ రకాల ప్రశ్నలన్నీ అడగనుంది.
  • సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ మార్కెట్లలో మెటా కంపెనీ గుత్తాధిపత్యాన్ని ప్రశ్నించేలా ఉండే అంశాలను అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ లేవనెత్తే ఛాన్స్ ఉంది.
  • ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌లను అమెరికాలోని ఇతర టెక్ కంపెనీలకు అమ్మేసేలా మెటాను పలు ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది.
  • ‘‘పోటీ పడడం కంటే వాటిని కొనడమే ఉత్తమం’’ అంటూ జుకర్‌బర్గ్‌ గతంలో చేసిన ఒక మెసేజ్‌పై  వివరణ కోరేందుకు అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ రెడీ అవుతోందట.

Also Read :Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

కోర్టు మెట్లు ఎక్కిన మెటా 

ఇక ఈ  ‘యాంటీ ట్రస్ట్ ట్రయల్’పై కోర్టును మెటా ఆశ్రయించింది. తమ కంపెనీ పెట్టుబడులు పెట్టకపోయి ఉంటే, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లకు ఇంత ఆదరణ వచ్చేదే కాదని మెటా న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒకవేళ కోర్టు ఉత్తర్వులు మెటాకు వ్యతిరేకంగా వస్తే, తదుపరిగా  అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ తీసుకునే నిర్ణయాలు కీలకం అవుతాయి. ప్రస్తుతం మెటా(ఫేస్ బుక్)  కంపెనీ ఆదాయంలో 50శాతం ఇన్‌స్టా‌గ్రామ్ నుంచే వస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Facebook
  • instagram
  • Mark Zuckerberg
  • meta
  • Meta Antitrust Trial
  • whatsapp
  • WhatsApp Sale

Related News

Donald Trump

Donald Trump: వైట్‌హౌస్‌లో ట్రంప్ విందు.. టెక్ దిగ్గజాలతో ఏఐ చర్చలు

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్నాలజీ ప్రపంచ దిగ్గజాలకు వైట్‌హౌస్‌లో ఘన విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సహా పలువురు టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగ నాయకులు హాజరయ్యారు.

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

  • China

    China : బీజింగ్‌లో చైనాకి శక్తి ప్రదర్శన.. పుతిన్, కిమ్, జిన్‌పింగ్ ఒకే వేదికపై

  • Kim to China on bulletproof train.. a strong signal to America

    Kim Jong Un : బుల్లెట్ ప్రూఫ్‌ రైలులో చైనాకు కిమ్‌.. అమెరికాకు బలమైన సంకేతం

  • India- China Direct Flights

    India- China Direct Flights: భార‌త్- చైనా మ‌ధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?

Latest News

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

  • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd