HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Good News For Gold Lovers Gold Prices Have Dropped Sharply

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-06-2026 - 11:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for gold lovers: Gold prices have dropped sharply.
Good news for gold lovers: Gold prices have dropped sharply.

భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల అనగానే మన ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేంది బంగారమే. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతే కాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి మార్గం. అయితే, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపించాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, ఇక్కడ దిగివచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ పెరగడం, రూపాయి పడిపోవడం వంటివి కారణమయ్యాయి. అయితే, ఇటీవలే ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇవాళ బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో జూన్ 16వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.

అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5 డాలర్ల వరకు తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4325 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.34 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి ధర 69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజుల తర్వాత దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.160 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,370 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం రేటు రూ.150 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,38,750 వద్దకు తగ్గింది.

బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈరోజు దిగివచ్చింది. గత మూడు రోజుల పాటు రూ.20 వేల మేర పెరిగిన తర్వాత ఇవాళ తగ్గింది. ఈరోజు రూ.5000 మేర కిలో వెండి ధర తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2,75,000 వద్దకు దిగివచ్చింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 22K gold rate
  • 24 Carat Gold Rate
  • 24 Carat Gold Rate Down
  • 24 carat gold rate today
  • 24K gold rate
  • Check Gold Rates
  • Daily gold price
  • Global Gold Prices
  • gold market . today gold price
  • gold price
  • gold sliver
  • sliver price

Related News

Gold Price

GOLD: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన పసిడి ధరలు

బంగారం కొనుగోలుదారులకు మళ్లీ శుభవార్త అందింది. వరుసగా బంగారం ధరలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ మరోసారి రూ. 3 వేల వరకు ధర తగ్గగా.. ఇది 6 నెలల కిందటి స్థాయికి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పతనం అవుతున్నాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న అంచనాలతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం కూడా మరో కారణం. పశ్చిమాసియా

  • Gold Prices

    GOLD: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా కుప్పకూలిన బంగారం ధరలు

Latest News

  • Redmi Turbo 5: భారీ బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఫోన్ లాంచ్.. రెడ్‌మీ టర్బో 5.. స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్

  • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • Cough Syrup: దగ్గు మందు అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి

  • Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

  • Chandrababu Naidu: సింగపూర్‌లో సీబీఎన్@361 డిగ్రీస్ పుస్తకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

Trending News

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd