Redmi Turbo 5: భారీ బ్యాటరీతో రెడ్మీ కొత్త ఫోన్ లాంచ్.. రెడ్మీ టర్బో 5.. స్పెసిఫికేషన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్
- Author : Vamsi Chowdary Korata
Date : 16-06-2026 - 1:57 IST
Published By : Hashtagu Telugu Desk
భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో రెడ్మీ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ‘రెడ్మీ టర్బో 5’ పేరుతో విడుదలైన ఈ ఫోన్లో 7,540mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మెరుగైన పనితీరు కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు.
ఫోన్లో 6.59 అంగుళాల 1.5K అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 3,500 నిట్స్ బ్రైట్నెస్ను అందించారు. డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పాటు LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్ ఉండటంతో గేమింగ్, మల్టీటాస్కింగ్ పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫోన్‌కు IP66, IP68, IP69 రేటింగ్స్ కూడా ఉన్నాయి.
ఫొటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్లో 7,540mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం ఉంది. 8GB+256GB వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12GB+256GB మోడల్ ధర రూ.40,999గా నిర్ణయించారు. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులపై రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. జూన్ 19 నుంచి అమెజాన్ ద్వారా విక్రయాలు ప్రారంభం కానున్నాయి.