Gold-Silver Price: నేటి బంగారం, వెండి ధరలివే.. మీ నగరంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
బంగారానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బంగారం, వెండి వస్తువులే. ఇకపోతే శుక్రవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది.
- By Gopichand Published Date - 11:02 AM, Fri - 13 December 24

Gold-Silver Price: శుక్రవారం బంగారం ధరలో (Gold-Silver Price) భారీగా తగ్గుదల కనిపిస్తోంది. అదే సమయంలో వెండి ధర కూడా తగ్గినట్లు తెలుస్తోంది. గురువారం 22 క్యారెట్ల బంగారం ధర రూ.72, 850తో పోలిస్తే నేడు 22 క్యారెట్ల 10గ్రాముల ధర రూ.72,300కి చేరింది. అదేవిధంగా గురువారం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 470 ఉండగా.. నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.78, 870కి చేరింది. గురువారం వెండి ధర కిలో రూ. 96,500తో పోలిస్తే నేడు రూ.93,500కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 600 తగ్గింది. మీ నగరంలో ప్రస్తుత ధర ఎంత ఉందో తెలుసుకుందాం.
మెట్రో నగరాల్లో బంగారం ధరలు ఇవే
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,450గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.79,020గా ఉంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది.
Also Read: Manchu Manoj Fight: మద్యం మత్తులో మంచు మనోజ్ గొడవ.. వీడియో వైరల్?
తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఏ ఫంక్షన్ అయినా ముందుగా మనకు గుర్తుకు వచ్చేది బంగారం, వెండి వస్తువులే. ఇకపోతే శుక్రవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,300గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.78,870గా ఉంది.
బంగారం హాల్‌మార్క్‌ని ఎలా తనిఖీ చేయాలి?
అన్ని క్యారెట్ల బంగారం హాల్‌మార్క్ సంఖ్య భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్ బంగారంపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని రాసి ఉంటుంది. అలా రాసిని బంగారు ఆభరణాలపై వాటి స్వచ్ఛత గురించి ఎటువంటి సందేహం లేదు. క్యారెట్ బంగారం అంటే 1/24 శాతం బంగారం, మీ ఆభరణాలు 22 క్యారెట్ అయితే 22ని 24తో భాగించి 100తో గుణించండి.