Manchu Manoj Fight: మద్యం మత్తులో మంచు మనోజ్ గొడవ.. వీడియో వైరల్?
ఈ వీడియోలో గొడవ ఏ రోజు జరిగిందనే తెలియదు. ఫ్యామిలీ గొడవల సందర్భంగా ఎవరో ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారని నెటిజన్లు సైతం చర్చించుకుంటున్నారు.
- By Gopichand Published Date - 10:30 AM, Fri - 13 December 24

Manchu Manoj Fight: మంచు ఫ్యామిలీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంచు మనోజ్‌కు (Manchu Manoj Fight) సంబంధించిన ఓ వీడియో లీక్ అయ్యింది. మోహన్ బాబు ఇంటి లోపల మనోజ్ ఎవరితోనో గొడవ పడుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. అయితే ఆయన దౌర్జన్యం చేస్తున్నాడా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. ఈ వీడియోను ఎవరు లీక్ చేశారనే విషయం తెలియరాలేదు.
ఈ వీడియోపై భిన్న వాదనలు వస్తున్నాయి. ఈ వీడియోలో గొడవ ఏ రోజు జరిగిందనే తెలియదు. ఫ్యామిలీ గొడవల సందర్భంగా ఎవరో ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారని నెటిజన్లు సైతం చర్చించుకుంటున్నారు. మరోవైపు రెండు రోజుల క్రితం జరిగిన గొడవలో మోహన్ బాబు గాయానికి గురై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన గురువారం డిశ్చార్జ్ అయ్యారు.
Also Read: ICC Champions Trophy: విరాట్-రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతారా?
ఇక మోహన్ బాబు ఆరోపిస్తున్నది నిజమే అన్న విషయం ఈ వీడియోతో స్పష్టం అవుతోందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ వివాదంలో మోహన్ బాబు మీడియాకు ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. అయితే మనోజ్- మోహన్ బాబు వివాదంలో సన్నిహితులు కలగజేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వివాదం ప్రస్తుతానికి అయితే సెటిల్ అయినట్లే తెలుస్తోంది. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఇప్పటికే మంచు మనోజ్, విష్ణులను విచారణ చేసి బాండ్ రాపించుకున్నారు. మరోవైపు మనోజ్ సైతం తన షూటింగ్‌లకు వెళ్తున్నట్లు సమాచారం.
మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా?
అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన మంచు మోహన్ బాబు పూర్తిగా కోలుకున్నారు. గురువారం ఆయనను డిశ్చార్జ్ చేయడంతో జల్‌పల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. అయితే బీఎన్‌ఎస్ యాక్ట్ 109 సెక్షన్ కింద మోహన్ బాబుపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలనుంటే ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.