మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!
ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.
- Author : Gopichand
Date : 17-12-2025 - 7:25 IST
Published By : Hashtagu Telugu Desk
- ఆధార్ కార్డు ఉన్నవారికి మరో అలర్ట్
- 1947 నంబర్‌తో డబ్బు, సమయం ఆదా
Aadhaar: మీ ఆధార్ కార్డులో పేరు, చిరునామా తప్పుగా ఉన్నా లేదా ఫోన్ నంబర్ మార్చుకోవాలన్నా.. వెంటనే ఆధార్ సెంటర్లు లేదా నెట్ కేఫ్‌ల చుట్టూ తిరగడం మొదలుపెడతాం. ఈ క్రమంలో చాలా సార్లు ప్రజలు నకిలీ ఏజెంట్ల బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ మీ సమస్యలన్నింటికీ కేవలం ఒక ఫోన్ కాల్‌తో పరిష్కారం లభిస్తుందని మీకు తెలుసా?
అవును ఆధార్ కార్డుకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా మీరు నేరుగా UIDAI అధికారిక నంబర్ 1947కి కాల్ చేయవచ్చు. ఈ హెల్ప్‌లైన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ, ఉర్దూ సహా మొత్తం 12 భాషల్లో మీకు సహాయం అందిస్తుంది.
1947 నంబర్‌తో డబ్బు, సమయం ఆదా
సాధారణంగా ఆధార్‌లో మార్పుల కోసం సైబర్ కేఫ్లకు వెళ్తే సమయం వృథా అవ్వడమే కాకుండా వారు భారీగా డబ్బులు వసూలు చేస్తారు. పైగా అక్కడ ఇచ్చే సమాచారం ఎంతవరకు సరైనదనే గ్యారెంటీ ఉండదు. అందుకే ఆధార్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా UIDAI అధికారిక నంబర్ 1947 కే కాల్ చేయండి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సంవత్సరం కాబట్టి ఈ నంబర్‌ను గుర్తుంచుకోవడం చాలా సులభం. ఇది టోల్-ఫ్రీ నంబర్, అంటే కాల్ చేసినందుకు మీకు ఎలాంటి ఛార్జీలు పడవు.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు
ఏ సమయంలో కాల్ చేయాలి?
ఈ కాల్ సెంటర్ సేవలు వినియోగదారుల కోసం ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి.
సోమవారం నుండి శనివారం వరకు: ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు.
ఆదివారం: ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు.
ఏయే సమాచారం పొందవచ్చు?
1947 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు ఈ క్రింది వివరాలు తెలుసుకోవచ్చు.
మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాల వివరాలు.
ఆధార్ అప్లై చేసిన తర్వాత దాని స్టేటస్ తెలుసుకోవడం.
ఒకవేళ ఆధార్ కార్డు పోయినా లేదా పోస్ట్ ద్వారా ఇంకా అందకపోయినా సమాచారం పొందవచ్చు.
ఇతర ఆధార్ సంబంధిత సాంకేతిక సందేహాలకు పరిష్కారం.