HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Automobile
  • >Cars Are More Expensive In Pakistan Than In India

Cars Expensive: పాకిస్థాన్‌లో సంక్షోభం.. భారత్‌లో రూ. 5 లక్షల కారు అక్కడ రూ. 32 లక్షలు!

ట్యాక్స్, దిగుమతిపై పాకిస్థాన్ ఆధారపడటం వలన ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి భిన్నంగా భారత ప్రభుత్వం ఇటీవల GST 2.0ను అమలు చేసింది. దీని తర్వాత వాహనాలపై పన్ను రేట్లు 18% నుండి 40% పరిధిలో ఏకీకృతం చేయబడ్డాయి.

  • Author : Gopichand Date : 14-11-2025 - 8:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
November Car Sales
November Car Sales

Cars Expensive: పాకిస్థాన్‌లో ఆటోమొబైల్ రంగం తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అక్కడ కార్ల ధరలు (Cars Expensive) విపరీతంగా పెరగడం వలన ఆ ధరలు విన్న భారతీయ కొనుగోలుదారులు సైతం ఆశ్చర్యపోవడం ఖాయం. పాకిస్థాన్‌లో కార్ల ధరలు పెరగడానికి అధిక పన్నులు, స్థానిక తయారీ లోపించడం, విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బలహీనమైన సరఫరా గొలుసు ప్ర‌ధాన కార‌ణాలు అని తెలుస్తోంది. ఈ కారణాల వల్ల, భారతదేశంలో రూ. 5-6 లక్షలకు లభించే కారు పాకిస్థాన్‌లో 30-40 లక్షల పాకిస్థానీ రూపాయలలో (PKR) అమ్ముడవుతోంది.

ధరల వ్యత్యాసం

భారతదేశంలో బడ్జెట్ సెగ్మెంట్‌లో లభించే కార్లు.. పాకిస్థాన్‌లో లగ్జరీ శ్రేణి వాహనాలకు సమానంగా పరిగణించబడుతున్నాయి. ఈ ధరలను చూస్తే సాధారణ పౌరులకు కారు కొనడం పెద్ద ఆర్థిక భారంగా మారిందని స్పష్టమవుతోంది.

Also Read: Chanakya Niti: భార్యాభర్తల బంధం.. ఈ 5 రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు!

ప్రధాన మోడల్స్ ధరల పరిస్థితి

  • మారుతి వ్యాగన్-ఆర్‌ భారతదేశంలో కేవలం రూ. 4.98 లక్షలకు అందుబాటులో ఉన్న ఈ పాపులర్ కారు పాకిస్థాన్‌లో 32 లక్షల PKRకు అమ్ముడవుతోంది.
  • హోండా సిటీ Gen 4 భారతదేశంలో హోండా సిటీ సరసమైన ధర, నాణ్యతకు ప్రసిద్ధి. అయితే పాకిస్థాన్‌లో ఇప్పటికీ పాత Gen 4 మోడల్‌నే అమ్ముతున్నారు. దాని ధర 47.37 లక్షల PKR (భారతీయ రూపాయల్లో దాదాపు రూ. 14.75 లక్షలు). భారతదేశంలో ఇదే కారు కొత్త జనరేషన్ టాప్ మోడల్ రూ. 14.31 లక్షలకే లభిస్తుండగా అక్కడ పాత మోడల్ కూడా ఎక్కువ ధర పలుకుతోంది.
  • టయోటా ఫార్ట్యూనర్ భారతదేశంలో ఫార్ట్యూనర్ ధర అధికంగా ఉన్నప్పటికీ పాకిస్థాన్‌లో దీని ప్రారంభ ధర ఏకంగా 1.49 కోట్ల PKR (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 46 నుండి రూ. 47 లక్షలు) ఉంది.
  • సుజుకి స్విఫ్ట్ Gen 3 భారతదేశంలో రూ. 5.37 లక్షల నుండి ప్రారంభమయ్యే చవకైన హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్, పాకిస్థాన్‌లో పాత జనరేషన్ మోడల్‌కు 44.60 లక్షల PKR (సుమారు రూ. 13.89 లక్షలు) చెల్లించాల్సి వస్తోంది. ఇది భారతదేశంలోని చాలా కాంపాక్ట్ SUVల ధరల కంటే ఎక్కువ.
  • టయోటా హిల్క్స్ భారతదేశంలో రూ. 28.02 లక్షలకు లభించే టయోటా హిల్క్స్ ‘రెవో’ వెర్షన్ పాకిస్థాన్‌లో 1.23 కోట్ల PKR (సుమారు రూ. 38 లక్షలు)గా ఉంది.

భారత్‌లో ధరలు తక్కువగా ఉండటానికి కారణం

ట్యాక్స్, దిగుమతిపై పాకిస్థాన్ ఆధారపడటం వలన ఈ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి భిన్నంగా భారత ప్రభుత్వం ఇటీవల GST 2.0ను అమలు చేసింది. దీని తర్వాత వాహనాలపై పన్ను రేట్లు 18% నుండి 40% పరిధిలో ఏకీకృతం చేయబడ్డాయి. దీని వలన కార్ల ధరలపై సామాన్య ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది. అందుకే భారతదేశంలో కార్లు ఇప్పటికీ సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • auto news
  • Automobiles
  • Cars Expensive
  • Honda City
  • india
  • pakistan
  • Pakistan Swift

Related News

BRICS

బ్రిక్స్ నౌకాదళ విన్యాసాలకు భార‌త్ డుమ్మా.. కార‌ణ‌మిదే?!

ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరికతో, 2025లో ఇండోనేషియా రాకతో ఈ కూటమి మరింత విస్తరించింది.

  • Nissan Gravite MPV

    భార‌త మార్కెట్లోకి మ‌రో కొత్త కారు.. జ‌న‌వ‌రి 21న లాంచ్‌!

  • Modi- Trump

    భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!

  • FASTag

    టోల్ టాక్స్‌.. ఇక‌పై పూర్తిగా డిజిట‌లైజ్ ద్వారానే!

  • Iran

    ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీల‌క నిర్ణ‌యం!

Latest News

  • అస్సాం లో మోడీ పర్యటన, 10వేల మందితో ‘బాగురుంబా నృత్యం’

  • మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే అభివృద్ధి – బండి సంజయ్

  • USAలో నవీన్ హవా, వన్ మిలియన్ డాలర్స్ తో హ్యాట్రిక్

  • యాదగిరిగుట్ట ఈవోగా భవానీ శంకర్

  • దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతర ఈరోజు నుండి ప్రారంభం

Trending News

    • ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌!

    • ఐసీసీ అధికారి వీసా తిర‌స్క‌రించిన బంగ్లాదేశ్‌!

    • ఇక‌పై వారం రోజుల‌కొక‌సారి సిబిల్ స్కోర్ చూసుకోవచ్చు!

    • రేపే న్యూజిలాండ్‌తో మూడో వ‌న్డే.. టీమిండియా గెల‌వ‌గ‌ల‌దా?!

    • ఉజ్జయినిలోని బాబా మహాకాల్‌ను దర్శించుకున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd