HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan To Appear Before Cbi Court By Nov 20

YS Jagan: కోర్టుకే షెడ్యూల్ ఇచ్చిన వైఎస్ జ‌గ‌న్‌!

"కోర్టులో తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు?" అంటూ న్యాయవ్యవస్థ పట్ల ఈ వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు.

  • Author : Gopichand Date : 19-11-2025 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: దేశ న్యాయ చరిత్రలోనే అరుదైన, విస్మయపరిచే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక తీవ్రమైన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి ఏకంగా తాను కోర్టులో ఎంతసేపు ఉంటానో స్వయంగా న్యాయస్థానానికి ‘షెడ్యూల్’ సమర్పించడంపై ప్రజలు, న్యాయ నిపుణులు ముక్కున వేలేసుకుంటున్నారు.

‘11.30కి వచ్చి 12.30కు వెళ్ళిపోతా’

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, 13 ఏళ్లకు పైగా బెయిల్ పై ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) ఈ సంచలనానికి కేంద్ర బిందువుగా నిలిచారు. సుదీర్ఘ కాలంగా ఒక్కసారి కూడా కోర్టు విచారణకు హాజరు కాని జగన్, ఎట్టకేలకు న్యాయస్థానం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరు కావాల్సి వచ్చింది. అయితే ఈ హాజరు విషయంలో ఆయన అనుసరించిన వైఖరి విమర్శలకు దారి తీసింది. కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం.. “నేను ఉదయం 11.30 గంటలకు కోర్టుకు వస్తాను. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి వెళ్ళిపోతాను” అంటూ ఆయన కోర్టుకే ఒక గంట సమయాన్ని నిర్దేశించినట్లు సమాచారం.

Also Read: Air India: భారత్-పాక్ ఎయిర్‌స్పేస్ మూసివేత.. ఎయిర్ ఇండియాకు భారీ నష్టం!

జ‌గ‌న్‌ కోర్టు సమయాన్ని ఎలా నిర్ణయిస్తారు?

సాధారణంగా ఒక ముద్దాయి కోర్టు ఆదేశాలకు లోబడి, న్యాయమూర్తి విచారణ సమయానికి అనుగుణంగా హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ పూర్తయ్యే వరకు కోర్టులో ఉండే సంప్రదాయం ఉంది. కానీ ఈ కేసులో నిందితుడిగా ఉన్న జ‌గ‌న్ ఒక గంట పాటు మాత్రమే కోర్టులో ఉంటాను అని స్వయంగా ‘టైమ్ టేబుల్’ ఇవ్వడంపై ప్రజలు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

“కోర్టులో తాను ఎన్ని గంటల నుండి ఎన్ని గంటల వరకు ఉంటాను అనేది ఒక ముద్దాయి ఎలా నిర్ణయిస్తాడు?” అంటూ న్యాయవ్యవస్థ పట్ల ఈ వైఖరిని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కోర్టు ముందు అందరూ సమానమే అన్న సూత్రాన్ని గుర్తు చేస్తున్నారు. దాదాపు గంట పాటు కోర్టులో ఉంటాను అంటూ కోర్టుకే సమయం ఇచ్చిన ఈ వ్యవహారం చూసి సాధారణ జనం షాక్ అవుతున్నారు. ఈ అరుదైన సంఘటన దేశ న్యాయ చరిత్రలో చర్చనీయాంశంగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • cbi
  • hyderabad
  • Lotus Pond
  • Nampally court
  • ys jagan

Related News

Pawan Cbn Hyd

Hyderabad : సైబరాబాద్ అనేది చంద్రబాబు విజన్ కు ప్రతిరూపం – పవన్

రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులను, మహిళలను బూట్లతో తన్నించడం, దౌర్జన్యాలు చేయడం అమానుషమని మండిపడ్డారు. నాడు కనీసం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకే రక్షణ లేని పరిస్థితుల్లో, సామాన్య రైతులకు రక్షణ

  • Cbn Jagan

    AP Capital : జగన్ ను ఊసరవెల్లితో పోల్చిన చంద్రబాబు

  • Asbl Sriramanavami

    Sriramanavami : ఏఎస్‌బిఎల్ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Rajahmundry Kakinada Trains

    Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి

Latest News

  • IPL 2026 : ఫస్ట్ మ్యాచ్ లో RCB చేతిలో SRH చిత్తు

  • CM Revanth Reddy: అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ ఉక్కుపాదం

  • IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH

  • Peddi : ‘పెద్ది’ రీమేక్ మూవీనా..?

  • TFJA Dairy Discovery : మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా TFJA డైరీ ఆవిష్కరణ

Trending News

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd