HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Is Making A Dent In The Alliance

YCP: కూట‌మిలో చిచ్చు పెడుతున్న వైసీపీ!

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు టీడీపీ నాయ‌కుల‌ను ఇష్టానుసారం తిట్టిన నేత‌ల‌ను ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన పార్టీలు చేర్చుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

  • Author : Gopi Date : 02-01-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YCP
YCP

YCP: 2024లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ కూట‌మి ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి ఏకంగా 164 స్థానాల్లో విజ‌య‌ఢంకా మోగించింది. 11 స్థానాల్లో వైసీపీ (YCP) గెలుపొంది ప్ర‌తిప‌క్ష హోదా కోసం పాకులాడుతోంది. అయితే వైసీపీలో ఉన్న కొంద‌రు నాయ‌కులు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కూట‌మి పార్టీల‌వైపు మొగ్గుచూపుతున్నారు. కూట‌మిలో పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌ల్లో చేరేందుకు వైసీపీ తాజా, మాజీ నాయ‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడే ఇదే విష‌య‌మై కూట‌మిలో చిచ్చు రేగిన‌ట్లు తెలుస్తోంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు టీడీపీ నాయ‌కుల‌ను ఇష్టానుసారం తిట్టిన నేత‌ల‌ను ఇప్పుడు బీజేపీ, జ‌న‌సేన పార్టీలు చేర్చుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వైసీపీ నాయ‌కుల చేరిక‌లు వ‌ద్ద‌ని టీడీపీ బాస్‌కు కార్య‌క‌ర్త‌లు, నేత‌లు తెగేసి చెప్పిన‌ట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ మాజీ నాయ‌కుల‌కు టీడీపీ ద్వారాలు మూసుకుపోవ‌డంతో వారు బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌ను ఆశ్ర‌యిస్తున్నారు.

Also Read: Projects: అభివృద్ధి ప‌థంలో భార‌త్‌.. ఈ ప్రాజెక్టులే నిద‌ర్శ‌నం!

ఇలా వైసీపీ నాయ‌కులు ఆయా పార్టీల కండువాలు క‌ప్పుకోవ‌డంతో కూటమి పార్టీల నడుమ వైసీపీ వలస నేతలు కుంపట్లు రాజేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే బీజేపీ, జనసేనల్లో చేరికలను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఎన్నికల ముందు తమను ఇబ్బంది పెట్టినవారిని ఎలా చేర్చుకుంటారని జ‌న‌సేన, బీజేపీ నాయ‌కుల‌ను ప్రశ్నిస్తున్నారు. వైసీపీ నుంచి వలసలను వద్దని టీడీపీ నేతలు చెబుతున్నా.. మిగిలిన రెండు పార్టీలు మాత్రం వారి మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్ట‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

అయితే జ‌న‌సేన మాత్రం స్థానిక‌త ఆధారంగానే పార్టీలో జాయిన్ చేసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదేశాల‌తోనే పార్టీలోకి వైసీపీ మాజీ నాయ‌కులు వ‌స్తున్నార‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌ను ఇప్ప‌టినుంచే బ‌లోపేతం చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పెద్ద పార్టీగా అవ‌త‌రిస్తుంద‌ని ఈ మేర‌కు ప‌వ‌న్ పార్టీలోకి ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌న‌సేన‌లో వైసీపీ మాజీ నాయ‌కులు బాలినేని, ఉద‌య‌భాను, రోశ‌య్య‌ చేరిన విష‌యం తెలిసిందే.

జ‌నంలోకి జ‌గ‌న్‌..?

మ‌రోవైపు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సంక్రాంతి నుంచి జ‌నంలోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. వారానికోక జిల్లాలో వైసీపీ బాస్ ప‌ర్య‌ట‌న ఉంటుంద‌ని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమ‌ర్నాథ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అంతేకాకుండా స్థానిక వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌తో చ‌ర్చించి గ‌తంలో చేసిన స‌మ‌స్య‌ల‌కు కూడా ప‌రిష్కారం క‌నుగొంటామ‌న్నారు మాజీ మంత్రి. అయితే జ‌గ‌న్.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై భారీ విమ‌ర్శ‌లకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap politics
  • bjp
  • CM Chandrababu
  • Janasena
  • Pawan Kalyan
  • tdp
  • ycp
  • ys jagan

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ, విషెన్ హలంబగే గొడవపై స్పందించిన క్రికెట్‌ బోర్డు.. శ్రీలంక క్రికెటర్‌కే భారీ జరిమానా

    • Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

    • Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

    • Reebok: రీబాక్ భాగస్వామ్యంతో ‘లాస్ట్ వన్ స్టాండింగ్’ ప్రారంభం 

    • Isuzu Motors India: వాహనదారులకు ఇసుజు బంపర్ ఆఫర్ 

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd