HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Will Win Again And Take Oath As Cm In Visakhapatnam Cm Jagan

YS Jagan: మళ్లీ గెలిచి విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తా: సీఎం జగన్

  • Author : Latha Suma Date : 05-03-2024 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Will Win Again And Take Oat
Will Win Again And Take Oat

 

 

YS Jagan: సిఎం జగన్ విశాఖపట్నం(Visakhapatnam)లో ఏర్పాటు చేసిన విజన్ విశాఖ సదస్సు(Vision Visakha Programme)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ఎన్నికల్లో ఈసారి కూడా విజయం తమదేనని, మళ్లీ గెలిచి విశాఖ నుంచి సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తానని వెల్లడించారు. వచ్చే ఎన్నికల తర్వాత విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని తెలిపారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అమరావతి ఇప్పటికే శాసనరాజధానిగా కొనసాగుతోందని పేర్కొన్నారు. విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామని, అందుకే విశాఖ వంటి పెద్ద నగరం రాష్ట్రానికి అవసరం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

అభివృద్ధిలో విశాఖ నగరం దూసుకెళుతోందని అన్నారు. హైదరాబాద్ కంటే విశాఖలో అభివృద్ధి అధికంగా జరుగుతోందని వివరించారు. బెంగళూరు కన్నా విశాఖలోనే మెరుగైన సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విపక్షానికి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కోర్టు కేసులతో విపక్షాలు అడ్డుకుంటున్నాయని, స్వార్థ ప్రయోజనాల కోసం విశాఖపై విషం చిమ్ముతున్నారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదివరకు కూడా సీఎం జగన్ చాలాసార్లు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. విశాఖలో జరిగిన కార్యక్రమాలకు వెళ్లిన ప్రతిసారీ.. తాను త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతానని అన్నారు. కానీ ఇప్పటివరకూ అది జరగలేదు. గత ఏడాది డిసెంబర్ లోపే షిఫ్ట్ అవుతానన్న ఆయన.. అలా చెయ్యలేకపోయారు. కారణం.. అమరావతి అంశం కోర్టుల్లో ఉంది. కోర్టు మూడు రాజధానులకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, అప్పుడు ప్రభుత్వం విశాఖ నుంచి పరిపాలన సాగించడం కష్టమవుతుంది. అందువల్ల కోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగాలని జగన్ భావిస్తున్నారు. నెక్ట్స్ ఎన్నికల్లో గెలవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చి, విశాఖ నుంచి పాలన సాగించాలని ప్లాన్ వేసుకున్నట్లు ఆయన తాజా మాటలనుబట్టీ అర్థమవుతోంది.

read also : AP : జగన్ కంపెనీలు కళకళ…రాష్ట్ర ఖజానా దివాలా! – నారా లోకేష్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • Visakhapatnam
  • Vision Visakha Programme
  • vizag
  • ysrcp

Related News

Infosys In Visakhapatnam

విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

Infosys : విశాఖపట్నం ఐటీ రంగంలో దూసుకుపోతోంది! గూగుల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇన్ఫోసిస్ శాశ్వత క్యాంపస్ కోసం భూమి అడుగుతోంది.. ప్రభుత్వంతో చర్చించగా సానుకూలత వచ్చింది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్, సిఫీ డేటా సెంటర్లు కూడా వస్తున్నాయి. పరిశ్రమలు కూడా అనకాపల్లి వైపు

    Latest News

    • ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

    • టెస్ట్ క్రికెట్‌కు విలియ‌మ్స‌న్‌ రిటైర్మెంట్?!

    • కొత్త పథకాలను ప్రవేశ పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం కసరత్తు

    • పిల్లలతో అలాంటి పనులేంటి జగన్ – మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు

    • ‘పదేళ్ల పాలనకు స్వస్తి చెప్పి ప్రజలు మీ తోలు తీశారు’ అంటూ కేసీఆర్ పై పొన్నం ఫైర్

    Trending News

      • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

      • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

      • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

      • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

      • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd