HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Weather Update Tirumala In A Peaceful Atmosphere

Tirumala Weather: ప్రశాంత వాతావరణంలో తిరుమల.. య‌థావిధిగా శ్రీవారి న‌డ‌క మెట్టు మార్గం!

అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.

  • Author : Gopi Date : 17-10-2024 - 10:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala Weather
Tirumala Weather

Tirumala Weather: వాయుగుండం తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని 42-44 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ (Tirumala Weather) నిపుణుల అంచనాలు తలకిందులు అయ్యాయి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని తడవద్ద తీరం దాటుతుందని అధికార వాతావరణ నిపుణులు హెచ్చరికలతో ఇటు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల అధికారులు అలెర్ట్ అయ్యారు. పునరావస్తు కేంద్రాలు, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు.

అయితే తీరం దాటక మునుపే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడ ఒక చినుకు కూడా రాలేదు. మరోవైపు తిరుమలలో శ్రీవారి మెట్టు మార్గంలో నడక దారిని గురువారం మూసివేస్తున్నామని టీటీడీ అధికారులు ప్రకటించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అయితే వర్షాలు లేకపోవడంతో యధావిధిగా వారిని పంపించడానికి.. మెట్ల మార్గాన్ని తెరవడానికి టీటీడీ అధికారులు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద వాతావరణ నిపుణులు అంచనాలు.. తాజా వాయుగుండం అంచనాలు తలకిందులయ్యాయి. తీరం దాటిన తర్వాత కూడ ఎక్కడా వర్షాలు కురవలేదు. భారీ వర్షం నేపథ్యంలో గురువారం శ్రీవారి మెట్టు నడక మార్గం మూసివేస్తున్న‌ట్లు టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు బుధ‌వారం తెలిపిన విష‌యం తెల‌సిందే. అయితే వ‌ర్షం లేక‌పోవడంతో శ్రీవారి మెట్టు న‌డ‌క మార్గం గుండా భ‌క్తులు రాక‌పోక‌లు సాగిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: Delhi Capitals: గంగూలీకి ఢిల్లీ క్యాపిట‌ల్స్ షాక్‌.. డీసీ డైరెక్ట‌ర్‌గా కొత్త వ్య‌క్తి?

శ్రీవారిని ద‌ర్శించుకున్న ప్ర‌ముఖులు

తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, నటి రాశి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారిని ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వారికి తీర్థ ప్రసాదాలను టీటీడీ ఉన్నతాధికారులు అంద‌జేశారు.

ప‌లు జిల్లాల్లో స్కూళ్ల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు

వాయుగుండం కారణంగా మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావ‌ర‌ణ శాఖ బుధ‌వారం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు వాతావరణ శాఖ కురుస్తాయన్న హెచ్చరికలతో గురువారం పలు జిల్లాల్లోని స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో గురువారం స్కూళ్ల‌కు సెలవుగా ప్ర‌క‌టించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh Weather
  • floods
  • IMD
  • IMD Alerts
  • IMD forecast
  • rains
  • schools
  • Srivari Nadaka Mettu Margham
  • tirumala
  • tirupathi
  • weather
  • Weather Forecast

Related News

Southwest monsoon spreading across Telangana.

IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు లేక, ఎండల తీవ్రతతో అల్లాడిపోతున్న సామాన్య ప్రజలకు, రుతుపవనాల రాక కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న రైతాంగానికి భారత వాతావరణ శాఖ అత్యంత తీపి కబురు అందించింది. మందగించిన నైరుతి రుతుపవనాలు తిరిగి తమ ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం అయ్యాయని.. జూన్ 23వ తేదీ మంగళవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇవి ఊపందుకోనున్నాయని న్యూఢిల్ల

  • TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

    TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd