HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >We Believe You Jagan Anna Task Utter Fail

Jagan Plan: మా నమ్మకం నువ్వే జగనన్నా.. ప్రోగ్రాం ఫోకస్

వైసీపీకి ఐ ప్యాక్ టీం ఎన్నికల వ్యూహకర్తగా ఉంది. ఆ సలహాలు తీసుకుని కొత్త కార్యక్రమాలను వైసీపీ అధినాయకత్వం డిజైన్ చేస్తోంది. అలా వచ్చిందే మా నమ్మకం నువ్వే జగనన్నా ప్రోగ్రాం. ఈ నెల 7 నుంచి ఏపీవ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలలో గొప్పగానే స్టార్ట్ అయింది.

  • Author : CS Rao Date : 10-04-2023 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We Believe You Are Jagan anna.. Utter Fail Talk
We Believe You Are Jaganan.. Utter Fail Talk

Jagan Plan : వైసీపీకి ఐ ప్యాక్ టీం ఎన్నికల వ్యూహకర్తగా ఉంది. ఆ సలహాలు తీసుకుని కొత్త కార్యక్రమాలను వైసీపీ అధినాయకత్వం డిజైన్ చేస్తోంది. అలా వచ్చిందే మా నమ్మకం నువ్వే జగనన్నా ప్రోగ్రాం. ఈ నెల 7 నుంచి ఏపీవ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలలో గొప్పగానే స్టార్ట్ అయింది. అయితే స్టార్ట్ అయిన ముహూర్తం సరిగ్గా ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ లో ఎండలు మండుతున్నాయి. మరో వైపు క్యాడర్ నీరసిల్లి ఉంది.

లీడర్లు అంతా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏడాదిగా తిరిగి అలసి సొలసి ఉన్నారు. ఈ టైం లో మరో కార్యక్రమం అది కూడా రెండు వారాల పాటు ఉధృతంగా తిరగాలని అదేశాలు వచ్చాయి. దాంతో తొలి రోజు మొక్కుబడిగా తిరిగిన మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తరువాతనే చతికిలపడ్డారనే అంటున్నారు.

ఇక ఈ తీరును చూసిన వారంతా మా నమ్మకం నువ్వే జగన్ (Jagan) ప్రోగ్రాం అపుడే ఫెయిల్ అయింది అని అంటున్నారు. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదేంటి అంటే ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్స్ కి క్యాడర్ కి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది. నాలుగేళ్ళుగా ఎమ్మెల్యేలు తమకేమీ చేయలేదన్న గుస్సాతో క్యాడర్ నిండా ఉంది. దాంతో ఎక్కడా ఎమ్మెల్యేలకు క్యాడర్ నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అంటున్నారు.

అంతే కాదు ఆర్భాటంగా ఏపీ వ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా గృహ సారధులను నియమించామని చెప్పుకున్నారు. అలగే సచివాలయం పరిధిలో ఒకరిని చైర్మన్ గా కూడా చేశామన్నారు. ఇపుడు గృహ సారధులు డుమ్మా కొడుతున్నారు వాలంటీర్ల చైర్మన్లు అయిపూ అజా లేకుండా పోతున్నారు.

ఇంటింటికీ ఇలా తిరగడం వల్ల మాకు ఏంటి అని గృహ సారధులు కానీ సచివాలయం చైర్మన్ కానీ క్యాడర్ కానీ గట్టిగానే ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారుట. ఎండలో కాళ్ళరిగేలా ఎందుకు తిరగాలి అన్నదే వారి ప్రశ్న. బాధ ఆవేదన. గృహ సారధులను ఎక్కడ నుంచో తీసుకోలేదు క్యాడర్ నుంచే ఎంపిక చేశారు. అలాగే సచివాలయం చైర్మన్లుగా ఉన్న వారు కూడా పార్టీకి చెందిన వారే.

అందువల్ల వారు సరైన సమయం చూసుకుని మరీ పార్టీ మాకేమిచ్చింది. మేము ఎందుకు రావాలీ అని అడుగుతున్నారని టాక్. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఫ్యామిలీని సైతం వదిలి వస్తే మాకు ఒరిగేది ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారుట. మొత్తానికి ఆదిలోనే ఇలాంటి తిరుగుబాటుని ఊహించని ఎమ్మెల్యేలు మాత్రం ఖంగు తింటున్నారుట. మరో వైపు చూస్తే ఎమ్మెల్యేల ఫోటలు వీడియోలు తీసుకుని చాలా మంది వెళ్తున్నారుట.

ఇవన్నీ చూస్తూంటే ఒక్కటే అనిపిస్తోందని వైసీపీని అభిమానించే వారు హితైషులు అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితాలను ఇపుడు అనుభవిస్తుంది అని అంటున్నారు. అది ఏ విధంగా ఉందంటే అధినాయకత్వానికి ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది. ఎమ్మెలెయలకు లీడర్స్ కి గ్యాప్ ఉంది. లీడర్స్ కి క్యాడర్ కి మధ్య బిగ్ గ్యాప్ ఉంది. అలా ఏ వైపు నుంచి చూసినా అంతరాలే అవాంతరాలుగా మారుతున్నాయి.

అయినా కూడా ఎక్కడ లోటు ఉందో పొరపాటు ఉందో చూసుకోకుండా దానికి సరి చేసుకోకుండా నేల విడిచి సాము చేయాలనుకుంటే హడావుడిగా ఆర్భాటంగా ఇలాంటి కార్యక్రమాంలు చేపడితే జనంలోనూ ఇతర పార్టీల వద్ద అభాసుపాలు కావడం తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. ఎక్కడైనా పార్టీని కడుపులో పెట్టుకుని చూసుకుంటే ఇన్ని తిప్పలు అవస్థలు పడనవసరం లేదని అంటున్నారు.

జనాలతోనే కనెక్షన్ అన్నా కూడా వారిని పార్టీని అనుసంధానం చేసేది ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. క్యాడర్ లేకుంటే జనాలతో పార్టీకి లింక్ ఎలా ఉంటుంది అన్న సూక్షమైన విషయాన్ని విస్మరించడం వల్ల ఈ తరహా కార్యక్రమాలు ఎన్ని చేపట్టిన వైసీపీకి ఇబ్బందులు తపవనేఅ అంటున్నారుట.

Also Read:  Bandi Sanjay: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బలగం సినిమా చూసిన బండి సంజయ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • belief
  • I-PAC Team
  • jagan
  • Stickers
  • Trust
  • ycp
  • ysrcp

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Konidela Village

    కొణెదల పేరుతో గ్రామం..రూ.6 కోట్లను మంజూరు చేసిన పవన్ కళ్యాణ్

  • Ambati Rambabu

    అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

  • Centre Of Excellence For Ai

    ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్‌ కి ఏడు ఒప్పందాలు

Latest News

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd