Bandi Sanjay: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బలగం సినిమా చూసిన బండి సంజయ్
బలగం సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఓటిటిలోకి వచ్చినా దాని ప్రభావం తగ్గడం లేదు.చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
- Author : Hashtag U
Date : 10-04-2023 - 4:37 IST
Published By : Hashtagu Telugu Desk
Bandi Sanjay : బలగం సినిమా ప్రభంజనం కొనసాగుతుంది. ఎక్కడ చూసినా బలగం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా ఓటిటిలోకి వచ్చినా దాని ప్రభావం తగ్గడం లేదు.చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కళ్ళకి కట్టినట్లు చూపించడంలో దర్శకుడు, నటుడు వేణు సక్సెస్ అయ్యాడు. అయితే తాజాగా బలగం సినిమాను వీక్షించారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని దేవి ధియేటర్ లో బలగం సినిమా చూశారు ఎంపీ బండి సంజయ్. ఈ రోజు మధ్యాహ్నం.. బండి సంజయ్ (Bandi Sanjay) తోపాటు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు 200 మంది, మరియు ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధియేటర్ లో సినిమా చూశారు.
తెలంగాణ పల్లె వాతావరణం ఆధారంగా తెరకెక్కిన బలగం సినిమా చూసి ప్రతి ఒక్కరు కంటతడిపెడుతున్నారు. విడిపోయిన ఎన్నో బంధాలు మళ్ళీ కలుసుకున్నాయి. సినిమాలో చూపించిన విధంగా కుటుంబాల మధ్య ప్రేమలు, అనురాగాలు కరువయ్యాయి. ఎవరికి వారే అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. కానీ బలగం సినిమా అందర్నీ ఆలోచింపజేసింది. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలోను స్ట్రీమింగ్ అవుతుంది. తెలంగాణలోని పల్లెల్లో ఈ సినిమాను తెర మీద ప్రదర్శిస్తున్నారు. ఊర్లో వాళ్ళు సినిమా చూసి కన్నీరుపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా సినిమాలో బంధాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన ప్రతిఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారు.
బలగం సినిమాలో ప్రియదర్శి, చైల్డ్ ఆర్టిస్ట్ వల్లంకిపిట్ట ఫేమ్ కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలను పోషించారు.. ప్రముఖ కమెడియన్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్సితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ సహా ఎంతో మంది అద్భుతమైన నటనతో అలరించారు.
Also Read: High Court: హైకోర్టు సంచలనం, మేజిస్ట్రేట్ పై విచారణకు ఆదేశం