Vijayawada YCP : బెజవాడ వైసీపీ నేత సురేష్ హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు
విజయవాడలో ఓ వ్యక్తి కారు ఢీకొని చనిపోవడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. తొలుత అది రోడ్డు ప్రమాదం అని
- By Prasad Published Date - 11:35 AM, Mon - 10 October 22

విజయవాడలో ఓ వ్యక్తి కారు ఢీకొని చనిపోవడం ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది. తొలుత అది రోడ్డు ప్రమాదం అని భావించినా.. బాధిత కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలతో కేసు మరో మలుపు తిరిగింది. హతుడితో గతంలో గొడవలు జరిగిన వ్యక్తి పగ తీర్చుకునేందుకు కారుతో గుద్ది చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే వీరిద్దరూ వైఎస్ఆర్ సీపీలో కింది స్థాయి కార్యకర్తలుగా పోలీసులు చెప్తున్నారు. విజయవాడలో తన భర్త సురేష్‌ని, చౌడేష్ అనే మరో వ్యక్తి కారుతో ఢీకొట్టి చంపాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి దేశి సురేష్ విజయవాడ ఐదో డివిజన్ వైసీపీ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. శనివారం రాత్రి 7 గంటల టైంలో సురేష్ తన కుమారుడికి ఐస్ క్రీమ్ తేవడం కోసం విజయవాడలోని క్రీస్తురాజ పురంలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లాడని సురేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల ముందు నుంచే సురేష్ గురించి చౌడేష్ రెక్కీ నిర్వహించారని ఆరోపించారు.