HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Vijayasai Reddy Once Again Shoots His Mouth Off Regarding Amaravati

Vijaya Sai Reddy: అమరావతిపై మరోసారి నోరు పారేసుకున్న విజయసాయిరెడ్డి

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 2:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Vijayasai Reddy about amaravati
Vijayasai Reddy about amaravati

Amaravati  ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అమరావతిపై ‘కమరావతి’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్య దుమారం రేపగా, ఆ తర్వాత ఇచ్చిన వివరణలో ఆయన అధికార కూటమితో పాటు తాను వీడిన వైసీపీని కూడా లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.

పార్లమెంట్ ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లు ను ఆమోదించిన కేంద్రప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు.
అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన. మీరు కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూచుకోండి. తస్మాత్ జాగ్రత్త!@ncbn @tdp @TV9Telugu…

— Vijayasai Reddy V (@VSReddy_MP) April 2, 2026

వివరాల్లోకి వెళితే… అమరావతి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై విజయసాయిరెడ్డి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో “రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి ఒక సూచన. ప్రభుత్వం కట్టేది అమరావతే తప్ప, కమరావతి కాకుండా చూసుకోండి.. తస్మాత్ జాగ్రత్త” అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లోని ‘కమరావతి’ పదంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

నిన్నటి నా ట్వీట్లో అమరావతిని కమరావతి కానివ్వ వద్దు అన్న సూచనను చూచి గంగవెర్రులెత్తిన వారంతా, కూటమి ఏమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారు? రాజదాని అమరావతి పై వైసీపీ కి స్పష్టత, స్థిరమైన విధానం లేదు…టీడీపీకి చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదు. https://t.co/Ypi1lITh6z…

— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2026

తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో విజయసాయిరెడ్డి మరో ట్వీట్‌తో స్పందించారు. “నిన్నటి నా ట్వీట్‌లో అమరావతిని కమరావతి కానివ్వవద్దు అన్న సూచనను చూసి గంగవెర్రులెత్తిన వారంతా, కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏమి బదులిస్తారు?” అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టమైన, స్థిరమైన విధానం లేదని, అదే సమయంలో టీడీపీకి ఇసుమంతైనా చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

అంతటితో ఆగకుండా తన మాజీ పార్టీ వైసీపీ ఎంపీల తీరును కూడా ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. “సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ అలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా?” అంటూ నిలదీశారు.

2024 ఎన్నికల తర్వాత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించినప్పటికీ, ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఏపీ రాజకీయాలపై తరచూ స్పందిస్తూ, కీలక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజా వ్యాఖ్యలతో ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీలను ఏకకాలంలో లక్ష్యంగా చేసుకున్నారు.

సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీ లకు చీమకుట్టినట్లైనా అనిపించలేదా? అడ్డుకోరా? ఖండించరా? మౌన ప్రేక్షకులైనారా? https://t.co/zBIoj78cdN@ncbn @tdp @TV9Telugu @NtvTeluguLive @tv5telugu @abntelugutv…

— Vijayasai Reddy V (@VSReddy_MP) April 3, 2026


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati bill
  • Amaravati capital
  • andhra pradesh
  • Andhra Pradesh TDP
  • AP CM Chandrababu Naidu
  • ap politics
  • Former MP Vijayasai Reddy
  • Jagan Cheap Politics
  • Kamaravati
  • Parliament Bill
  • rajyasabha bill
  • ys jagan

Related News

Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

APSPDCL: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీకి గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది, ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 629 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ ప్రకటన వెలువడింది. వివిధ ప్రభుత్వ విద్యుత్ సంస్థల వారీగా విభజించిన ఈ ఖాళీలలో.. ఏపీ ట్రాన్స్‌కో (AP Transco) లో అత్యధికంగా 200 పోస్టులు ఉన్నాయి. వీటి

  • Tender coconut claims a life

    ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Former MP Vijayasai Reddy files petition in High Court regarding Amaravati capital.

    Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

  • Somireddy Chandramohan Reddy lashes out at YCP chief Jagan.

    Somireddy Chandramohan Reddy: వైసీపీ అధినేత జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd