HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ttd Release Of January Darshan Quota

TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

  • Author : Gopi Date : 17-10-2025 - 8:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TTD
TTD

TTD: 2026 జనవరి నెలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) విడుదల చేయనున్న వివిధ దర్శనాలు, ఆర్జిత సేవలు, గదుల కోటా వివరాలను ప్రకటించింది. భక్తులు ఆన్‌లైన్‌లో తమ దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకోవడానికి వీలుగా తేదీలను ఖరారు చేసింది.

ముఖ్యమైన విడుదల తేదీలు, సమయాలు

ఆర్జిత సేవా టికెట్లు & అంగప్రదక్షిణ టోకెన్లు: జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు (ఎలక్ట్రానిక్ డిప్ కోసం), అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను అక్టోబర్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ఈ సేవా టికెట్ల కోసం భక్తులు అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.

టికెట్లు పొందిన వారు అక్టోబర్ 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.

నాన్-డిప్ ఆర్జిత సేవా టికెట్ల విడుదల: కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

Also Read: Asia Cup 2025 Trophy: ప్ర‌స్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?

వర్చువల్ సేవల కోటా: వర్చువల్ సేవలు, వాటి అనుబంధ దర్శన స్లాట్‌లకు సంబంధించిన కోటాను అక్టోబర్ 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

శ్రీవాణి ట్రస్టు దర్శన కోటా: శ్రీవాణి ట్రస్టు ద్వారా దర్శన టికెట్ల కోటాను అక్టోబర్ 24న ఉదయం 11 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను అక్టోబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు (రూ. 300): ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల (ఎస్.ఇ.డి) కోటాను అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

గదుల కోటా విడుదల: తిరుమల, తిరుపతిలలో గదుల వసతికి సంబంధించిన కోటాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

భక్తులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారిక వెబ్‌సైట్ అ7యిన https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతిని బుక్ చేసుకోవాలని టీటీడీ ముఖ్య ప్రజా సంబంధా\ల అధికారి ఒక ప్రకటనలో కోరారు. జనవరి నెలలో రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Angapradakshinam tokens
  • devotional
  • devotional news
  • tirumala
  • tirupathi
  • ttd

Related News

TTD makes a key announcement: Arjita Sevas in Tirumala cancelled on June 28.

TTD కీలక ప్రకటన.. జూన్ 28న తిరుమలలో ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. జూన్ 26 నుంచి 28వ‌ తేదీ వరకు తిరుమల‌లోని శ్రీవారి ఆలయంలో సాలకట్ల జ్యేష్టాభిషేకం జ‌రుగ‌నుందని టీటీడీ తెలిపింది. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజుల‌ పాటు తిరుమల‌ శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో నిర్వహించే ఈ క్రతువును ‘’అభిద్యేయ

  • Do you know the history of Venkateswara Suprabhatam?

    Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

Latest News

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

  • Kajal Aggarwal: బాల‌య్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్.?

  • Vedanta Power : స్టాక్ మార్కెట్లోకి వేదాంత పవర్ ఎంట్రీ

  • Jnaneswari: తుని పాప మిస్సింగ్ రోజు.. CCTVలో బిగ్ ట్విస్ట్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd