HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tomorrow Distribution Of Exgratia Checks To The Victims Of The Tirupati Stampede

Tirupati Stampede: తొక్కిసలాట మృతులకు రేపు ఎక్స్‌గ్రేషియా చెక్కుల పంపిణీ!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. టికెట్ల కోసం భ‌క్తులు పెద్ద ఎత్తున్న త‌ర‌లిరావ‌డంతో తోపులాట జ‌రిగి అది కాస్త తొక్కిస‌లాట‌కు దారితీసింది.

  • Author : Gopi Date : 11-01-2025 - 3:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirupati Stampede
Tirupati Stampede

Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో మృతి చెందిన ఆరుగురి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ మేరకు జనవరి 12న బాధిత కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా చెక్కుల‌ను టీటీడీ అధికారులు పంపిణీ చేయ‌నున్నారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బోర్డు సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆరుగురు మృతులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు స్వయంగా వారిని సందర్శించి ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేసేందుకు కొంతమంది బోర్డు సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశారు.

రెండు క‌మిటీల్లో స‌భ్యులు వీరే

వైజాగ్, నర్సీపట్నం సందర్శించే బృందంలో బోర్డు సభ్యులు జోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, భాను ప్రకాష్ రెడ్డి ఉన్నారు. తమిళనాడు,కేరళను సందర్శించే బోర్డు సభ్యుల కమిటీలో శ్రీరామమూర్తి, కృష్ణమూర్తి వైద్యనాథన్, నరేష్ కుమార్, శాంత రాం, సుచిత్ర ఎల్లా ఉన్నారు. వీరు ఆయా ప్రాంతాల్లోని మృతుల కుటుంబాల ఇళ్లను సందర్శించి, స్థానిక ఎమ్మెల్యేల‌తో క‌లిసి ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కులను అందించనున్నారు. అదే విధంగా ఈ కమిటీలు ప్రతి కుటుంబంలో ఒకరికి ఒక కాంట్రాక్టు ఉద్యోగంతో పాటు టీటీడీ సంస్థల్లో ఉచిత విద్యను అందించడానికి సంబంధిత కుటుంబాల ఉద్యోగ, విద్యా వివరాలను కూడా ధృవీకరించి సేకరిస్తాయి. అంతే కాకుండా ఈ కమిటీ సభ్యులు తీవ్రంగా గాయపడిన భక్తులకు రూ. 5లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కులను, పాక్షికంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చెక్కులను కూడా పంపిణీ చేయనున్నారు.

Also Read: Osmania Hospital Foundation: ఈ నెలాఖరులోగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన: సీఎం రేవంత్‌

తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో విషాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. టికెట్ల కోసం భ‌క్తులు పెద్ద ఎత్తున్న త‌ర‌లిరావ‌డంతో తోపులాట జ‌రిగి అది కాస్త తొక్కిస‌లాట‌కు దారితీసింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌గా.. ప‌లువురికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన కొంద‌రు ప్ర‌స్తుతం తిరుప‌తిలోని రుయా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • ap police
  • Stampede
  • Tirupati
  • tirupati stampede
  • ttd
  • TTD Chairman BR Naidu
  • Vaikunta Dwara Sarva Darshan

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd