HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cancellation Of Vip Break Darshans From July To September

TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • Author : Vamsi Chowdary Korata Date : 08-07-2026 - 4:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cancellation of VIP break darshans from July to September
Cancellation of VIP break darshans from July to September
  • జూలై 14: కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • జూలై 17: ఆణివార ఆస్థానం
  • జూలై 19: శ్రీ ఆండవన్ ఆశ్రమం స్వామీజీకి పెద్ద మర్యాద
  • జూలై 29: శ్రీ జీయర్ స్వాముల చాతుర్మాస సంకల్పం
  • ఆగస్టు 22: పవిత్రోత్సవాలకు అంకురార్పణ
  • ఆగస్టు 24: పవిత్రోత్సవాల రెండో రోజు (పవిత్రాల సమర్పణ)
  • సెప్టెంబర్ 8: శ్రీవారి బ్రహ్మోత్సవాల కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
  • సెప్టెంబర్ 14: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
  • సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సమయం

జులై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీకో ముఖ్య గమనిక. ఈ మూడు నెలలకు సంబంధించిన వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూడు నెలల కాలంలో వివిధ పర్వదినాలు, ఉత్సవాలు తిరుమలలో జరగనున్నాయి. దీంతో ఆయా రోజులలో తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఆ వివరాలు ముందుగా తెలుసుకుంటే శ్రీవారి దర్శనానికి వీఐపీ సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయి.

జులై నెలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు వివరాలు..

జులై నెలకు సంబంధించి 14, 17, 19, 29వ తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. జులై 14వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17వ తేదీ ఆణివార ఆస్థానం, 19న ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, 29న జీయ‌ర్ స్వాముల చాతుర్మాస సంక‌ల్పం సందర్భంగా తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.

ఆగస్ట్ నెల విషయానికి వస్తే.. ఆగస్ట్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఆగస్ట్ 22వ తేదీ పవిత్రోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. అలాగే ఆగస్ట్ 24వ తేదీ పవిత్రాల సమర్పణ సందర్భంగా ఈ దర్శనాలు రద్దు చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహించనుంది. సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకూ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయా రోజులలో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తారు. అలాగే బ్రహ్మోత్సవాలకు ముందు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ కారణంగా సెప్టెంబర్ ఎనిమిదో తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసే సెప్టెంబర్ 14వ తేదీ కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో పేర్కొంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించాలని.. వీఐపీ బ్రేక్ దర్శనాల నేపథ్యంలో ఆయా ముందు రోజులలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Brahmotsavam 2026
  • Chairman TTD
  • Koil Alwar Thirumanjanam
  • Srivari Darshan
  • Tirumala Srivari Darshan
  • Tirumala Tirupati Devasthanams (TTD)
  • TTD Update
  • VIP Break Darshan

Related News

116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

TTD: 116 ఏళ్ల బామ్మకు శ్రీవారి దివ్య దర్శనం.. ఆదేశాలు జారీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల శ్రీవారి దర్శనం కోసం 116 ఏళ్ల బామ్మ కాలినడకన వెళ్లిన వీడియో వైరల్ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి నడక మార్గంలో వెళుతుండగా.. ఒక భక్తురాలు వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది వైరల్ అయ్యింది. ఈ వీడియోపై ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. ఆ బామ్మ 116 ఏళ్ల వయస్సులోనూ కాలినడకన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు చేరుకున్నారని.. ఆ భ

  • Vip Break Darshan For 116 Y

    TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

  • 116-year-old grandmother to have divine darshan of Srivaru; TTD Chairman BR Naidu issues orders.

    TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

Latest News

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd