HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Noose Tightens Around A Ycp Leader In The Dastagiri Murder Case

YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 3:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Accused Nithyananda Reddy
Accused Nithyananda Reddy

కడపలో సంచలనంగా మారిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. గత నెల రోజులుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి ఎట్టకేలకు కటకటాల పాలయ్యారు. పోలీసుల వేట తీవ్రం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన లొంగిపోవాల్సి వచ్చింది. తాజాగా కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.

దస్తగిరి హత్య జరిగినప్పటి నుండి నిత్యానందరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం అనుమానాలకు తావిచ్చింది. ఆయన కోసం పోలీసులు పొరుగు రాష్ట్రాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. అయితే, పోలీసులు ఆయన ఆస్తులపై నిఘా పెట్టడం, అనుచరులను విచారించడంతో ఉచ్చు బిగుస్తోందని గ్రహించిన నిత్యానందరెడ్డి, సోమవారం అనూహ్యంగా జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఆయనను A-13 నిందితుడిగా చేర్చిన పోలీసులు, హత్యకు పథకం వేయడంలో ఆయనదే కీలక పాత్ర అని భావిస్తున్నారు.

ఈ హత్య కేవలం వ్యక్తిగత కక్షల వల్ల జరిగింది కాదు, దీని వెనుక వందల కోట్ల భూ వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. నిత్యానందరెడ్డి, దస్తగిరి ఇళ్లలో జరిపిన సోదాల్లో సుమారు 100 కోట్ల విలువైన భూములకు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు దొరకడం సంచలనం రేపింది. ప్రభుత్వ భూములను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై మార్చడం, ఆ పత్రాలతో బ్యాంకుల్లో భారీ రుణాలు పొందేందుకు ప్రయత్నించడం వంటి అక్రమాల్లో ఇద్దరి మధ్య వచ్చిన తేడాలే దస్తగిరి ప్రాణం తీశాయని పోలీసులు నిర్ధారించారు.

దస్తగిరిని దారుణంగా నరికి చంపిన నిందితులకు నిత్యానందరెడ్డి స్వయంగా ఆశ్రయం కల్పించినట్లు విచారణలో వెల్లడైంది. హత్య జరిగిన తర్వాత నిందితులు ఆయన ఇంట్లోనే తలదాచుకోవడం, అక్కడి నుండే పరారవ్వడం సంచలనంగా మారింది. కేవలం నిత్యానందరెడ్డే కాకుండా, ఆయన భార్య దీప్తిపై కూడా ఫోర్జరీ కేసులు నమోదు కావడంతో ఈ వ్యవహారం వైసీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన ఈ భూ కబ్జాల దందా ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది.

ప్రస్తుతం నిత్యానందరెడ్డి కడప సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే, ఈ భూ దందాల్లో మరికొందరు వైసీపీ ముఖ్య నేతల ప్రమేయం కూడా బయటపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ రికార్డులను తారుమారు చేయడంలో సహకరించిన అధికారుల జాబితా కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh politics
  • dastagiri
  • Dastagiri Murder
  • Faction Politics
  • Kadapa Central Jail
  • Nityananda Reddy
  • Pedda Dastagiri
  • ys jagan
  • YS Jagan Mohan Reddy
  • YSR Congress Party
  • ysrcp leaders

Related News

Capital region farmers obstructed the visit of YCP leaders.

Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పెనుమాక పర్యటనకు బయల్దేరి వెళ్లిన వైసీపీ CRDA పరిరక్షణ కమిటీని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను తాడేపల్లిలోని ఉండవల్లి వద్ద అమరావతి రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు, అమరావతి రైతులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ వాగ్వాదం, తోపులాట మరింత శ్రుతిమించి వైసీపీ నేత లేళ

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • Kodali Nani: Former Minister Kodali Nani visits AP High Court.

    Kodali Nani: ఏపీ హైకోర్టుకు మాజీ మంత్రి కొడాలి నాని

  • YS Jagan to visit Pulivendula tomorrow.

    YS Jagan Mohan Reddy: రేపు పులివెందుల పర్యటనకు వైఎస్‌ జగన్‌

Latest News

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd