HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Hemoglobin D Punjab Disease Is Causing Palpitation In Palnadu

Hemoglobin D Punjab : పల్నాడులో ‘పంజాబ్‌’ వ్యాధి కలకలం

పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది.

  • Author : Pasha Date : 28-05-2024 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hemoglobin D Punjab
Hemoglobin D Punjab

Hemoglobin D Punjab : పల్నాడు జిల్లాలో ఓ కొత్త వ్యాధి బయటపడింది. సాధారణంగా పంజాబ్‌ రాష్ట్రంలో మాత్రమే వ్యాపించే ఓ వ్యాధి ఇప్పుడు పల్నాడులో బయటపడింది. దీంతో స్థానికుల్లో కొంతమేర ఆందోళన మొదలైంది.  ఆ వ్యాధి పేరే.. ‘సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌’.

We’re now on WhatsApp. Click to Join

పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు చిన్నారుల్లో ‘సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌’ వ్యాధిని గుర్తించామని గుంటూరు సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పలపాడు శివారు శ్రీరాంపురంతండా నుంచి ఇటీవల ఇద్దరు పిల్లలు రక్తహీనత (ఎనీమియా) సమస్యతో ఈ ఆస్పత్రికి వచ్చారు. వీరికి గుంటూరు వైద్య కళాశాల పాథాలజీ విభాగం డాక్టర్లు రక్తపరీక్షలు నిర్వహించగా.. సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ అనే వ్యాధి ఉందని వెల్లడైంది. అరుదైన ఈ వ్యాధికి  ఒకే చికిత్స ఉంది. అదేమిటంటే.. ఎముక మజ్జ (మూలకణ) మార్పిడి చేయడం. ఈ ట్రీట్మెంట్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో  అందుబాటులో లేదు. ఒకవేళ తాత్కాలికంగా ట్రీట్మెంట్ చేయాలంటే.. దాతల నుంచి రక్తాన్ని సేకరించి, అందులోని ఎర్ర రక్త కణాలను వేరు చేసి పేషెంటుకు ఎక్కించాలి. ఇక సికిల్‌ హిమోగ్లోబిన్‌ డి-పంజాబ్‌ వ్యాధిని  గుర్తించిన ప్రాంతంలోని ఇతర పిల్లలకు కూడా రక్త పరీక్షలు చేయడం మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ వ్యాధి చాపకింద నీరులా  ఇతర పిల్లల్లోనూ వ్యాపిస్తుందేమో అనే ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Also Read :Bedroom Decoration : నవ దంపతులకు బెడ్‌రూం.. ఇలా ఉండాలి

  • సికిల్ హిమోగ్లోబిన్ డి- పంజాబ్‌(Hemoglobin D Punjab) వ్యాధికి మరో పేరు  హిమోగ్లోబిన్ -డీ (Hb D).
  • ఈ వ్యాధి ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్‌లాంటి దేశాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది.
  • మన దేశంలోని పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి.
  • ఈ వ్యాధి బారినపడిన వారు త్వరగా అలసిపోతుంటారు. చూడటానికి బలహీనంగా కనిపిస్తారు. వీరికి తరుచూ ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంటుంది.

Also Read :Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • guntur
  • Hemoglobin D Punjab
  • palnadu

Related News

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd