Bedroom Decoration : నవ దంపతులకు బెడ్‌రూం.. ఇలా ఉండాలి
పెళ్లి కాగానే జరిగే కీలకమైన ఏర్పాటు.. బెడ్ రూం.
- By Pasha Published Date - 08:05 AM, Tue - 28 May 24

Bedroom Decoration : పెళ్లి కాగానే జరిగే కీలకమైన ఏర్పాటు.. బెడ్ రూం. చాలామంది పడక గదిని అందంగా డెకొరేట్ చేయడంపైనే ఫోకస్ చేస్తారు. అందులో వాస్తు నియమాలను ఎంతమేర పాటిస్తున్నాం అనేది పెద్దగా పట్టించుకోరు. ఇలా చేస్తే కొత్తగా పెళ్లయిన ఆ దంపతుల బంధంపై ప్రతికూల ప్రభావం పడుతుందని పండితులు అంటున్నారు. చిన్నపాటి వాస్తు నియమాలను పాటిస్తూ కొత్తగా పెళ్లయిన వారికి బెడ్‌రూంను సిద్ధం చేస్తే చాలా మంచి జరుగుతుందని చెబుతున్నారు. కొత్త దంపతుల ఆనందకర జీవితానికి ఈ బెడ్ రూం పునాదిగా నిలుస్తుంది. అందుకే బెడ్ రూంలో ప్రతీదీ వాస్తుపరంగా సెట్ చేయాలి. దీనికి సంబంధించిన చిట్కాలు తెలియకుంటే.. నిపుణులను అడిగి తెలుసుకోవాలి. ఇంటి పెద్దలు చొరవ చూపి.. బెడ్ రూంను వాస్తుపరంగా సెట్ చేయించాలి. ఎందుకంటే అది వారి పిల్లల భవిష్యత్తుతో ముడిపడిన విషయం.
We’re now on WhatsApp. Click to Join
- అప్పుడే పెళ్లయిన కొత్త దంపతులకు ఏర్పాటు చేసే పడక గది(Bedroom Decoration).. ఈశాన్యం దిక్కులో అస్సలు ఉండకూడదు. నైరుతి దిక్కులో బెడ్ రూం ఉండటం శుభప్రదం. ఈ దిశలో బెడ్ రూం ఉంటే దంపతుల మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి.
- పడక గదిలో దక్షిణం వైపు తల ఉండేలా బెడ్‌ను అమర్చుకోవాలి.
- కొత్తగా మ్యారేజ్ అయిన వారు తమ వివాహ ఫొటోలను బెడ్ రూంలో గోడకు తగిలించుకునేందుకు బెస్ట్ ప్లేస్ తూర్పు దిక్కు. ఆ దిక్కులో ఫొటోలు పెడితే భార్యాభర్తల మధ్య సామరస్యం మరింత పెరుగుతుంది.
- బెడ్ రూంలో నలుపు, బ్రౌన్, గ్రే క్రీమ్ కలర్స్‌లో ఉండే వాల్ పేపర్లను అస్సలు పెట్టుకోవద్దు. బెడ్ షీట్లు, దుప్పట్లు, పిల్లో కవర్లు కూడా ఈ రంగులవి వాడొద్దు.
- మంచం ప్రతిబింబం కనిపించేలా బెడ్ రూంలో అద్దాన్ని పెట్టుకోవద్దు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పెద్దలు చెబుతుంటారు.
Also Read :Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు
- బెడ్ రూంలో మెటల్ ఫర్నీచర్ వాడకపోవడమే బెటర్. కలపతో చేసిన ఫర్నీచరే వాడితే మంచిది.
- మంచం మీద సింగిల్ మ్యాట్రెస్ వాడితే మరింత మంచిది.
- పనికి రాని వస్తువులను బెడ్ రూమ్‌లో ఉంచకూడదు. మన జాబ్ లేదా వ్యాపారానికి సంబంధించిన వస్తువులను బెడ్ రూంలో ఉంచొద్దు. వీటి వల్ల దంపతుల మధ్య గ్యాప్ పెరగొచ్చు.