Womens Health 2024 : నేడే ‘ఉమెన్ హెల్త్ డే’.. గొప్ప లక్ష్యం కోసం ముందడుగు
ఆరోగ్యం.. ఇది ఎవరికైనా ఒక్కటే. ప్రత్యేకించి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది.
- By Pasha Published Date - 07:34 AM, Tue - 28 May 24

Womens Health 2024 : ఆరోగ్యం.. ఇది ఎవరికైనా ఒక్కటే. ప్రత్యేకించి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. ప్రతీ కుటుంబంపైనా ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే.. సమాజానికి పునాది మహిళలే. భావితరాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పకుండా మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. వారికి సరైన వైద్యం అందాలి. తగిన పోషకాహారం అందాలి. ఈ అంశాలను గుర్తు చేసేందుకే ఏటా మే 28వ తేదీన ‘మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని’ సెలబ్రేట్ చేసుకుంటారు. దానిపై వివరాలివీ..
We’re now on WhatsApp. Click to Join
నేటి కాలంలో పురుషులతో సమానంగా మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంటే.. పురుషులతో సమానంగా మహిళలు కూడా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అలాంటప్పుడు ఆ ఒత్తిడి వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. వాటిని మొదట్లోనే గుర్తించి చికిత్సను మొదలుపెట్టేలా మహిళలకు అవగాహన కల్పించాలి. నిత్యం ఇల్లు, ఉద్యోగం, కుటుంబం గురించే ఆలోచిస్తూ చాలామంది వర్కింగ్ ఉమెన్ తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తాము దీపంలా కరిగిపోతూ ఇంట్లో వెలుగులు నింపుతున్నారు. వాస్తవానికి ఇలా చేయడం కరెక్టు కాదు. తమ ఆరోగ్యాన్ని చూసుకుంటూనే.. ఇవన్నీ చేయాలి. కుటుంబానికి, ఉద్యోగానికి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నారో.. ఆరోగ్యానికి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఆరోగ్యానికి ఏదైనా జరిగితే.. కుటుంబం, ఉద్యోగం రెండింటికీ దూరం కావాల్సి వస్తుందనే చేదు నిజాన్ని ముందే గ్రహించి మేల్కొనాలి.
Also Read :NTR Jayanti : ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు
ఇక హౌస్ వైఫ్‌ల విషయానికి వస్తే.. వారిపై అడుగడుగునా వివక్ష కనిపిస్తోంది. పోషకాహారం పొందే విషయం దగ్గరి నుంచి మొదలుకొని చికిత్స చేయించుకోవడం దాకా ఎక్కడ కూడా వారికి ప్రయారిటీ దక్కడం లేదు. ఈవిషయాల్లో నేటికీ పురుషులకే ప్రయారిటీ లభిస్తోంది. పోషకాహారం తీసుకోక పోవడం, జన్యుపరమైన కారణాలతో చాలామంది మహిళలు రక్తహీనత సమస్యను ఎదుర్కొంటున్నారు. మరెంతోమంది రక్తపోటు, మధుమేహం వంటి ప్రాబ్లమ్స్‌తో సతమతం అవుతున్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించకపోవడంతో.. బీపీ, షుగర్ స్టేజీలు బాగా పెరిగిపోయాక వారికి ఆ సమస్య ఉన్నట్టు తెలియడం లేదు. మహిళలకు కనీసం సంవత్సరానికి ఓసారి బీపీ, షుగర్‌లను టెస్ట్ చేయించాల్సిన నైతిక బాధ్యత కుటుంబ పెద్దపై ఉంటుంది.
Also Read :Phone Tapping : మీడియా చానెల్స్ యాజమాన్యాల ఫోన్లు సైతం ట్యాపింగ్ – రాధాకిషన్ రావు
హిస్టరీ ఇదీ..
లాటిన్ అమెరికన్, కరేబియన్ ఉమెన్స్ హెల్త్ నెట్‌వర్క్ (LACWHN) ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవాన్ని తొలిసారిగా 1987లో కోస్టారికాలో నిర్వహించారు. ఈసందర్భంగా ఏటా మే 28వ తేదీని మహిళల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవంగా(Womens Health 2024) పాటించాలని నిర్ణయించారు. ఈ తేదీన మహిళల ఆరోగ్య సంరక్షణ, అబార్షన్ హక్కులు, ఎయిడ్స్ , పేదరికం, గర్భనిరోధకాల వినియోగం వంటి వాటిపై మగువలకు అవగాహన కల్పిస్తుంటారు.