Councilors Shock To TDP: టీడీపీకి తొలి షాక్.. వైసీపీ గూటికి చేరిన కౌన్సిలర్లు
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- Author : Gopichand
Date : 09-10-2024 - 7:46 IST
Published By : Hashtagu Telugu Desk
Councilors Shock To TDP: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. ఇటీవల టీడీపీలో (Councilors Shock To TDP) చేరిన నలుగురు కౌన్సిలర్లు తిరిగి వైసీపీ గూటికి చేరారు. పార్టీ అధినేత జగన్‌ను కలిసి పార్టీ కోసం పనిచేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను భయపెట్టి పసుపు కండువా కప్పారని సదరు కౌన్సిలర్లు పేర్కొన్నారు. అయితే తిరిగి వైసీపీలో చేరిన కౌన్సిలర్లు ఇకపై పార్టీ మారేది లేదని జగన్‌కు భరోసా ఇచ్చారు. ఇకపోతే ఇప్పుడు వైసీపీకి పరిస్థితులు ఏమీ కలిసిరావటం లేదు. కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి, జనసేనలో చేరిపోతున్నారు. దీంతో ఏం చేయలేక దిక్కుతోచని స్థితిలో జగన్ ఉన్నారు.
మంగళగిరి వైసీపీ నాయకులతో జగన్ సమావేశం
మంగళగిరి వైసీపీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. ఆ కష్టాల్లోంచి హీరోలు, నాయకులు పుడతారు. మన పార్టీకి అండగా నిలిచిన వారికి.. భవిష్యత్తులో కీలక పదవులు ఇస్తాం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఢీ అనేలా సిద్ధంగా ఉండాలి’’ అని జగన్ నేతలకు సూచించారు.
Also Read: Diabetic Patients : షుగర్ ఉన్నవారి కోసం ప్రత్యేక బిర్యానీలు.. ఎక్కడంటే..?
హర్యానా ఎన్నికలపై ట్వీట్
మంగళవారం విడుదలైన హర్యానా ఎన్నికలపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. హర్యానా ఎన్నికలు గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. ప్రజల సైతం ఆశ్చర్యపోతున్నారని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎలా జరిగాయో హర్యానా ఎన్నికలు కూడా అలాగే జరిగనట్లు ఉందని ట్వీట్ లో పేర్కొన్నారు. ఇకపై దేశంలో ప్రజాస్వామ్యం నిలవాలంటే పాత విధానమైన పేపర్ బ్యాలెట్ విధానాన్ని ఫాలో కావాలని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల్లో సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానాన్నే అనుసరిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. పేపర్ బ్యాలెట్ విధానం కోసం చట్ట సభ సభ్యులు ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ ట్వీట్‌తో జగన్‌కు బీజేపీకి మధ్య దూరం పెరిగిందనే భావన స్పష్టంగా అర్థమవుతోంది.