Roja Multitalented Daughter Anshu: 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించిన రోజా కూతురు!
ఇకపోతే రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్‌గా, కంటెంట్ రైటర్‌గా, డెవలపర్‌గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది.
- By Gopichand Published Date - 02:47 PM, Fri - 27 December 24

Roja Multitalented Daughter Anshu: మాజీ మంత్రి, నటి రోజా కుమార్తె అన్షు మాలిక (Roja Multitalented Daughter Anshu) రోజా సెల్వమణి తన తల్లి రోజాను.. తండ్రి సెల్వమణిని మించిపోయింది. 20 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనతను అన్షు సాధించింది. తాజాగా నైజీరియా లాగోస్‌లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అన్షు మాలిక గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవార్డును సాధించింది. కూతురు సాధించిన ఈ ఘనతను మాజీ మంత్రి రోజా తన ఎక్స్ ఖాతా వేదికగా తెలిపి ఆనందం వ్యక్తం చేశారు. రోజా ఈ విషయం తన ఎక్స్ ఖాతా ద్వారా చెప్పగానే వైసీసీ కార్యకర్తలు, అభిమానులు పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే రోజా కూతురు అన్షు మాలిక్ కంటెంట్ క్రియేటర్‌గా, కంటెంట్ రైటర్‌గా, డెవలపర్‌గా, సామాజిక కార్యకర్తగా అనేక విభాగాల్లో గుర్తింపు పొందింది. 7 ఏళ్ల వయసులోనే అనేక సాంకేతికతను అలవాటు చేసుకున్న అన్షు ఆ వయసులోనే కోడింగ్ నేర్చుకుంది. తన 16-17 ఏళ్ల మధ్య ఫేస్ రికగ్నిషన్ బాట్ యూసింగ్ డీప్ లర్నింగ్ అనే విభాగం గురించి ఏకంగా థీసిస్ రాసింది. ఆమె రాసిన ఈ థీసిస్ రీసెర్చ్ గురించి అంతర్జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచురించింది. ఆమెతన 12వ తరగతిలో 95 శాతానికి సమానమైన 10 GPAతో కంప్యూటర్ సైన్స్‌ను అభ్యసించడానికి బ్లూమింగ్టన్‌లోని ఇండియానా విశ్వవిద్యాలయంలో చేరింది. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్ అభ్యర్థులను ఆవిష్కరణ, ప్రభావం, స్థిరత్వం, వారి చొరవ స్కేలబిలిటీ వంటి వివిధ పారామితులపై అంచనా వేస్తుంది.
Also Read: Manmohan Singh : మన్మోహన్ సింగ్ కాంగ్రెస్‌కు బలమైన వికెట్‌గా ఎలా మారారు..!
Your hard work and perseverance have paid off congratulations dear #AnshuMalika ❤️ thank you team @TheDeccanMirror 💐 https://t.co/02DYIbTp2o
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 27, 2024
సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో అన్షు మాలికా గుర్తింపు పొందడం అనేది వ్యవస్థాపకత పట్ల ఆమె సంపూర్ణ విధానానికి నిదర్శనం. ఇక్కడ లాభాలు అంతిమంగా కాకుండా సానుకూల సామాజిక ఫలితాలను విస్తరించే సాధనంగా పరిగణించబడతాయి. అవార్డును స్వీకరించిన అన్షు మాట్లాడుతూ.. సాంకేతికత శక్తిని, సామాజిక మార్పును తీసుకురావడానికి సాధనాలుగా స్టోరీ టెల్లింగ్‌ను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అన్షు ఇతర సామాజిక వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు మరియు విధాన రూపకర్తలతో కూడా సమావేశమయ్యారు, ఆఫ్రికా అంతటా, వెలుపల తన కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయడానికి దారితీసే సంభావ్య భాగస్వామ్యాల గురించి చర్చించారు.