CM Jagan: సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన రైతులు.. పక్కకు నెట్టేసిన సెక్యూరిటీ సిబ్బంది
శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ (CM Jagan)కు చేదు అనుభవం ఎదురైంది. తుంపర్తి గ్రామస్తులు జగన్ కాన్వాయ్ (CM Jagan’s Convoy)ను అడ్డుకున్నారు.
- Author : Gopichand
Date : 27-04-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
శ్రీ సత్యసాయి జిల్లాలో సీఎం జగన్ (CM Jagan)కు చేదు అనుభవం ఎదురైంది. తుంపర్తి గ్రామస్తులు జగన్ కాన్వాయ్ (CM Jagan’s Convoy)ను అడ్డుకున్నారు. పరిహారం విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బుధవారం నార్పలలోని జగనన్న నివాసంలో జరిగిన ఆశీర్వాద కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. నార్పల నుంచి పుట్టపర్తికి వెళ్తున్న ప్రత్యేక హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తికి చేరుకున్నారు.
పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చేందుకు 210 ఎకరాలు సేకరించి నష్టపరిహారం ఇవ్వని ఏపీ ప్రభుత్వం
సీఎం జగన్ కాన్వాయ్‌ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన తుంపర్తి, మోటుమర్రి రైతులు
రైతులను పక్కకు నెట్టి పక్కన విసిరేసిన ముఖ్యమంత్రి సెక్యూరిటీ సిబ్బంది pic.twitter.com/DJv5LYajpx
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2023
ఈ సమయంలో ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. భద్రతా సిబ్బంది వారిని పక్కకి నెట్టేశారు. దీంతో సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది. పరిహారం అందించడంలో స్థానిక ఎమ్మెల్యే విఫలమయ్యారని వారు వాపోయారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని.. పోలీసులు తోసివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Hyderabad Students: అమెరికాలో ఇద్దరు హైదరాబాదీలు మృతి.. యూఎస్ లోనే అంత్యక్రియలు..!
బుధవారం ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో విద్యార్థుల ఖాతాలకు “జగనన్న విద్యా దీవెన” పథకం నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమయ్యాయి. జగనన్న వసతి గృహాల ఆశీర్వాదం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేలు అందజేశారు.