HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Our Capital Is Amaravati This Is A Historic Day Cm Chandrababu

AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 02-04-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu Govt
Chandrababu Govt

Chandrababu ఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్‌లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “గత ఐదేళ్లు రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారు. అమరావతి అంటే సెంటిమెంట్, కానీ ఆ పేరు వింటేనే జగన్‌కు కంపరంగా ఉంటుంది. అందుకే నిత్యం విషం కక్కుతున్నారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టపడక ‘మావిగన్’ అని వింత పేరుతో పిలుస్తున్నారు. గతంలో ‘ఎస్ఆర్ఎం అమరావతి’ అని ఉంటే దాన్ని ఎస్ఆర్ఎంగా మార్పించారు. అమరావతి పట్ల ఆయనకున్న ద్వేషం భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైంది” అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

బిల్లు ఆమోదం పొందినందుకు ఈ రోజు సాయంత్రం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో సంబరాలు జరపాలని కూటమి శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. తాను మధ్యాహ్నం రాజధాని శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వెళ్లి వేడుకల్లో పాల్గొంటానని తెలిపారు. దేశంలోని పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన నీరు, మట్టి ఉన్న పవిత్ర ప్రాంతంలో సంకల్పం తీసుకుంటానని చెప్పారు.

“గతంలో ‘మీకు 3 రాజధానులా’ అని ఎగతాళి చేశారు. ఇప్పుడు ‘ఏకైక రాజధాని నా రాజధాని అమరావతి’ అని ప్రతి ఒక్కరూ గౌరవంగా చెప్పుకునే రోజు వచ్చింది. రాజధానికి స్థిరత్వం కల్పించిన ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాకు, మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు” అని చంద్రబాబు పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను కూడా సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన విజయమని మనోహర్ అభివర్ణించారు. సాయంత్రం జరిగే సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొంటాయని వారు స్పష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati Bill Passed
  • Amaravati capital
  • amit shah
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • AP CM Chandrababu
  • narendra modi
  • nda govt
  • rajyasabha

Related News

Andhrapradesh Talliki Vandanam Scheme

Cm Chandrababu Naidu: తల్లికి వందనంపై కీలక ప్రకటన

Talliki Vandanam Scheme  ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తోంది. గతేడాది ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బుల్ని జమ చేసిన సంగతి తెలిసిందే. 2026కు సంబంధించి తల్లికి వందనం పథకం అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ నెలలో డబ్బులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ̵

  • andhra pradesh Release Pending Dues retired employees

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రూ.7,059 కోట్ల బకాయిల విడుదల

  • Nara Lokesh On Capital Bill

    Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం.. నారా లోకేష్

  • Amaravati Bill In Parliamen

    Rajya Sabha: అమరావతి చట్టబద్ధత బిల్లు రేపు రాజ్యసభకు!

  • Pemmasani Chandrasekhar

    Pemmasani Chandrasekhar: 29 వేల మంది రైతులకు జరిగిన అన్యాయం ఇది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Latest News

  • ది రాజధాని రైతుల విజయం.రేణుకా చౌదరి

  • Kerala Assembly Election 2026 : యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదల చేసిన తెలంగాణ సీఎం రేవంత్

  • AP Elections : 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల పట్ల సంచలన ఆరోపణలు చేసిన పరకాల

  • ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

  • AP Capital: మన రాజధాని అమరావతి.. ఇది చారిత్రాత్మక దినం. సీఎం చంద్రబాబు

Trending News

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

    • అల‌ర్ట్‌.. నేటి నుంచి కీల‌క మార్పులు!

    • శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ జరిమానా.. గ‌తేడాది కూడా ఇదే త‌ప్పు!

    • Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

    • AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd