HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Speech In Mahanadu Program

Mahanadu : ఘనంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు-2026.. కార్యకర్తల్లో జోష్ నింపిన చంద్రబాబు ప్రసంగం

  • Author : Prasad Date : 27-05-2026 - 11:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahandu 2026
Mahandu 2026

తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం మహానాడు-2026 ఘనంగా ప్రారంభమైంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడులో పొలిట్ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“జై తెలుగుదేశం” నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగగా, చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. “మీటింగ్ మోడల్ మారిందే తప్ప.. మహానాడు స్ఫూర్తి మారలేదు” అని పేర్కొన్నారు.

టీడీపీ ఆవిర్భావం నుంచి సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందని చంద్రబాబు అన్నారు. “కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ భావజాలంతో టీడీపీ పుట్టింది. విజన్ పాలిటిక్స్‌కు రూపం తెలుగుదేశం పార్టీ” అని వ్యాఖ్యానించారు. “జాతీయ జెండా దేశ గౌరవానికి ప్రతీక అయితే.. పసుపు జెండా తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నం” అని చెప్పారు. 45 ఏళ్లుగా ప్రజా సమస్యలపై టీడీపీ నిరంతర పోరాటం చేస్తోందని గుర్తుచేసిన చంద్రబాబు.. దాడులు, హింస, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ వెనకడుగు వేయలేదన్నారు. “నరహంతకులు పీకలు కోసినా టీడీపీ కార్యకర్తలు జెండాను విడిచిపెట్టలేదు. చంద్రయ్యలాంటి కార్యకర్తలు ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అంటూ అమరులయ్యారు” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తనను అక్రమంగా జైలుకు పంపారని, లోకేష్ యువగళ యాత్రను అడ్డుకున్నారని, పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆరోపించారు. “బాధితుల్నే నిందితులుగా మార్చినా ప్రజాస్వామ్యం కోసం టీడీపీ పోరాటం ఆపలేదు” అని స్పష్టం చేశారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా పనిచేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చేందుకు పాలనలో అగ్రెసివ్‌గా, ప్రోగ్రెసివ్‌గా ముందుకు సాగుతున్నామని చెప్పారు. మహిళా సాధికారత కోసం టీడీపీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్న చంద్రబాబు.. “ఆస్తి హక్కు నుంచి ‘తల్లికి వందనం’ వరకు మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ గౌరవం కోసం పనిచేస్తున్నాం” అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • ap tdp
  • Mahanadu 2026
  • nara lokesh
  • tdp

Related News

Mavigan vs. Amaravati in the upcoming elections... YS Jagan's challenge!

Amaravati Vs MAVIGUN: వ‌చ్చే ఎన్నిక‌ల్లో మావిగన్ వర్సెస్ అమరావతి.. వైఎస్‌ జగన్‌ సవాల్..!

ఏపీ రాజధాని అమరావతిని వైసీపీ అధినేత జగన్ మరోసారి తిరస్కరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము మావిగన్‌కే కట్టుబడి ఉన్నామని… వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అని ఆయన అన్నారు. మావిగన్ ప్రతిపాదనకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మావిగన్‌కు మద్దతు ఇచ్చేవారంతా వైసీపీకి ఓటు వేస్తారని చెప్పారు. ఈ రెండు రాజధానుల్లో ప్రజల మద్దతు దేనికి ఎక్కువగా ఉందో వచ్చే ఎన్నికల్లో త

  • Good news for the unemployed in AP: Green signal given to fill job vacancies in the Electricity Department.

    AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd